Akshaya Tritiya: అక్షయ తృతీయ శుభ ముహర్తం, పూజ విధానం బంగారం కొనే సమయం ఎప్పుడంటే..

లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. కొన్ని పరిహారాలతో ఏడాది పొడవునా ఆనందం, అదృష్టం ఉంటాయని.. జీవితానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ శుభ ముహర్తం, పూజ విధానం బంగారం కొనే సమయం ఎప్పుడంటే..
Akshaya Tritiya
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2023 | 10:25 AM

హిందూ మతంలో అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్ట స్థానం ఉంది. ఆనందం, అదృష్టంతో ముడిపడి ఉన్న ఈ పవిత్రమైన పండుగ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజున చేసే పూజ పాటించే నియమాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయని విశ్వాసం. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. కొన్ని పరిహారాలతో ఏడాది పొడవునా ఆనందం, అదృష్టం ఉంటాయని.. జీవితానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ  పర్వదినం శుక్రవారం 22 ఏప్రిల్ 2023 వచ్చింది. మత విశ్వాసాల ప్రకారం  అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవితో పాటు విష్ణువు, కృష్ణుడు , గణేశుడిని పూజించడం కూడా ప్రయోజనకరం. అంతే కాకుండా గంగాస్నానం , దానం పూజలు కూడా ముఖ్యమైనవి. ఆస్తికి సంబంధించిన పనులు చేయడం, గృహ ప్రవేశం మొదలైన శుభ కార్యాలు ఈ తేదీన చేయవచ్చు.

అక్షయ తృతీయ శుభ సమయం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి, నారాయణుని ఆరాధించడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం, కలశ పూజకు అనుకూలమైన సమయం ఏప్రిల్ 22, 2023 ఉదయం 07:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. పూజ సమయం మొత్తం 04 గంటల 31 నిమిషాల పాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బంగారం కొనడానికి..

హిందూ మతానికి సంబంధించిన విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం లేదా ఆభరణాలు లేదా పాత్రలు మొదలైనవి కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. వీటిని కొనడానికి ఏప్రిల్ 22, 2023 ఉదయం 07:49కి శుభప్రదం. మరోవైపు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 07:47 ని.ల సమయం శుభ ఫలితాలను ఇస్తుంది.

అక్షయ తృతీయ పూజా విధానం అక్షయ తృతీయ రోజున చేసే కార్యక్రమాలు పూజ అఖండ ఫలితాలను ఇస్తాయి. ఈ పవిత్రమైన తేదీలో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం, ధ్యానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి. వీలైతే అక్షయ తృతీయ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. అనంతరం పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేస్తూ.. మంచి గుడ్డను పరచండి. అనంతరం పసుపు వస్త్రంపై పూజ చేయడానికి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. అనంతరం స్వామివారికి  గంగాజలంతో స్నానం చేయించండి. తులసిని, పసుపు పూల మాల లేదా పసుపు పుష్పాలను సమర్పించండి. స్వామివారికి నైవేద్యంగా పండ్లు, పువ్వులు, తులసి, ఆహారపదార్ధాలను సమర్పించండి. వీలైతే, పసుపు పువ్వులు సమర్పించండి. అక్షయ తృతీయ నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి, విష్ణు సహస్రనామం చదవండి లేదా ఆయన మంత్రాలను జపించండి. పూజ ముగింపు సమయంలో  విష్ణువు కి హారతి ఇవ్వండి. అనంతరం పూజలో నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)