Aja Ekadashi 2025: అజ ఏకాదశి రోజున పొరపాటునైన ఈ తప్పులు చేస్తే.. ఉపవాసం ఫలితం దక్కదు..
హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి, శుక్ల పక్షం ఏకాదశి తిథి ఉపవాసం చేయడం.. శ్రీ మహా విష్ణువు పూజకు శుభప్రదంగా భావిస్తారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తి గత జన్మల పాపాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.

శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అని పిలుస్తారు. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన ఉపవాసం. ఈ రోజున చేసే ఉపవాసం, పూజ సకల పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అజ ఏకాదశి ఉపవాసం ఆగస్టు 19, 2025న పాటించబడుతుంది. మీరు ఈసారి కూడా ఈ ఉపవాసం పాటించబోతున్నట్లయితే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. తెలిసి తెలియకుండా చేసే పొరపాటు వలన దాని పూర్తి ప్రయోజనాలను పొందలేరు. అజ ఏకాదశి రోజున ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..
అజ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి?
అన్నం తినవద్దు: ఏకాదశి నాడు అన్నం తినడం నిషిద్ధం. ఈ రోజున అన్నం తినడం వల్ల ఉపవాసం ఫలాలు లభించవని ఉపవాసం చేసిన ఫలితం లభించదని నమ్ముతారు. కనుక ఈ రోజున ఏ రూపంలోనైనా అన్నం తినవద్దు.
తామసిక ఆహారం: ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం సహా ఇతర తామస పదార్థాలు ఈ రోజున అస్సలు తినకూడదు. మనస్సు , శరీరం రెండింటిలోనూ పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపవాస ఫలాలు లభిస్తాయి.
ఇతరులకు చెడు చేయవద్దు: ఉపవాసం అంటే కేవలం ఆహారం, పానీయాలు మానేయడమే కాదు మనసును పవిత్రంగా ఉంచుకోవడం కూడా. ఏకాదశి నాడు ఎవరినీ విమర్శించడం, వారి గురించి చెడుగా మాట్లాడటం లేదా అబద్ధం చెప్ప వద్దు. కోపం లేదా ద్వేషం మనసులోకి ప్రవేశించనివ్వకండి. ప్రశాంతంగా ఉండి దేవుడిని ధ్యానించండి.
జుట్టు, గోర్లు కత్తిరించవద్దు: హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం అశుభంగా భావిస్తారు. అలా చేయడం వల్ల ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు లభించవని నమ్ముతారు.
తులసిని ముట్టుకోవద్దు: తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. అయితే ఏకాదశి నాడు, తులసి మొక్కను ముట్టుకోకూడదు లేదా దాని ఆకులను కోయకూడదు. తులసి మాత కూడా ఈ రోజున నిర్జల ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. మీరు విష్ణు పూజ కోసం ఒక రోజు ముందు తులసి ఆకులను కోసుకోవాలి ఉంటుంది.
పగలు నిద్రపోవద్దు: ఉపవాసం ఉన్న రోజున పగలు నిద్రపోవడం అశుభమని భావిస్తారు. ఈ రోజున వీలైనంత ఎక్కువగా ధ్యానం చేసి దేవుడిని పూజించాలి. వీలైతే రాత్రంతా మేల్కొని విష్ణువుని కీర్తిస్తూ జాగరణ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.







