- Telugu News Photo Gallery Spiritual photos These are the Vastu rules that you must follow when buying a new house
Vastu Tips : కొత్త ఇల్లు కొంటున్నారా.. తప్పక చూడాల్సిన వాస్తు నియమాలివే!
ఇల్లు కొనేముందైనా, ఇంటి నిర్మాణం సమయంలోనైనా సరే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.కాగా, మనం ఇప్పుడు కొత్త ఇల్లు కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలో చూద్దాం.
Updated on: Aug 19, 2025 | 2:46 PM

ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించుకోవడం అనేది చాలా మంది అతి పెద్ద కల. అందుకే ఆలస్యం అయినా పర్లేదు కానీ, మంచి ప్రదేశంలో చాలా అందంగా తమ ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటారు. దీని కోసం వాస్తు, అక్కడి వాతావరణం ఇవన్నింటిని చూసి మంచి ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు.

కానీ కొంత మంది తొందరపాటు, తక్కువ ధరకే ఇల్లు వస్తుందనే ఉత్సాహంతో వాస్తు సరిగ్గాలేని ఇంటిని కొనుగోలు చేసి చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, ఇప్పుడు మనం కొత్త ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో చూద్దాం.

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తప్పక చూడాలంట. ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం ఉత్తరం, తూర్పు, ఈశన్య దిశలో మాత్రమే ఉండాలంట. దక్షిణ దిశలో ప్రధాన ద్వారం ఇంటిని కొనుగోలు చేయకూడదంట. దీని వలన అడ్డంకులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే నీటి ట్యాంక్ ఉత్తరం లేదా ఈ శాన్య దశలో ఉండాలంట, మెట్లు దక్షిణ లేదా పడమర దిశలో బాత్ రూమ్స్ వాయువ్యం లేదా ఆగ్నేయ దిశలో ఉండటం మంచిదంట.

వంట గది అనేది వాస్తును చాలా ప్రభావితం చేస్తుంది. అందువలన వంట గది ఆగ్నేయ దిశలో ఉండి, తూర్పు దిశ వైపు తిరిగి వంట చేసే విధంగా వంట రూమ్ ఉండాలంట. సింక్, గ్యాస్ స్టవ్ దగ్గర దగ్గరగా ఉండకుండా చూసుకోవాలంట.

అలాగే యజమాని పడుకునే బెడ్ రూమ్ విషయంలో కూడా తప్పక వాస్తు నియమాలు చూడాలంట. వాస్తు ప్రకారం, యజమాని పడుకునే గది నైరుతి దిశలో ఉండటం చాలా మంచిదంట. పడుకునే సమయంలో తల దక్షిణం లేదా పడమర వైపు ఉండేలా చూసుకోవాలని, పడక గదిలో అద్దం ఎప్పుడూ పడకకు ఎదురుగా ఉండకూదంట.



