- Telugu News Photo Gallery Spiritual photos Rahu Dosha: These zodiac signs to have negative impacts in life check remedies in telugu
Rahu Dosha: ఈ రాశుల వారికి రాహు దోషాలు.. ఈ పరిహారాలు చేయడం మంచిది!
జ్యోతిషశాస్త్రంలో రాహువును ఒక విష సర్పంగా అభివర్ణించడం జరిగింది. ఎప్పుడు ఎలా కాటు వేస్తాడన్నది ముందుగా ఊహించలేం. శని, కుజుల కంటే అత్యంత పాప గ్రహం రాహువు. ప్రస్తుతం కుంభ రాశిలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి రాశిలోనూ ఏడాదిన్నర పాటు సంచారం చేసే రాహువు కుంభ రాశిలో 2026 డిసెంబర్ 5 వరకూ కొనసాగుతాడు. ఈ రాశుల వారు రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది. రాహువుకు ప్రత్యేక పూజలు చేయించడం మంచిది. అంతేకాక, తరచూ సుబ్రహ్మణ్య స్వామికి లేదా గణపతికి అర్చన చేయించడం కూడా మంచిది.
Updated on: Aug 19, 2025 | 5:30 PM

కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఈ రాశివారు ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు పెడతారు. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక, అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ఆదాయంలో చాలా భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం వంటివి జరుగుతాయి.

సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు పెరుగుతాయి. వాదోపవాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇష్టమైన బందుమిత్రులు దూరమవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు ఒక పట్టాన పూర్తి కావు. జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురికావడం జరుగుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు బానిసవుతారు. రావలసిన డబ్బు చేతికి అందదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. రాజపూజ్యాల కంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. పిల్లలు అనారోగ్యాలతో బాధపడతారు. పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం పెరుగుతుంది. గర్భస్రావాలకు అవకాశం ఉంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమయ్యే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. వివాదాలు, విభేదాలు, అపార్థాలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అనారోగ్యాలు సమస్యలు తలెత్తుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది పెడతాయి.

కుంభం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. సన్నిహితుల వల్ల మోసపోవడం, నష్టపోవడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. వ్యయప్రయాసలతో గానీ పనులు పూర్తి కావు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ధన నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. మిత్రుల వల్ల నష్టపోయే అవ కాశం ఉంటుంది. ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టినా నష్టపోవడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రహస్య శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.



