Srikanth Reddy : ఏ ముఖం పెట్టుకొని సభకు రావాలో తెలియక అసెంబ్లీ సమావేశాన్ని టీడీపీ బాయ్ కాట్ చేసింది : శ్రీకాంత్ రెడ్డి
YCP MLA srikanth reddy : ఏ ముఖం పెట్టుకొని సభకు రావాలో తెలియక అసెంబ్లీ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ బాయ్ కాట్ చేసిందని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు...
YCP MLA Srikanth reddy : ఏ ముఖం పెట్టుకొని సభకు రావాలో తెలియక అసెంబ్లీ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ బాయ్ కాట్ చేసిందని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల్లో తమ బండారం బయటపడుతుందనే టీడీపీ అసెంబ్లీకి రానంటోందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపు అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అమరావతికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామని అయినా ప్రతిపక్ష తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నాటకాలాడుతోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాగా, రేపు (ఈ నెల 20)వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తూతూమంత్రంగా ఒక్క రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతోనే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత కూడా అయిన అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.