CM YS Jagan : నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

AP CM YS Jagan virtually launched CT scan and MRI facilities : ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు...

CM YS Jagan : నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను  వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌
Ap Cm Ys Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: May 19, 2021 | 1:48 PM

AP CM YS Jagan virtually launched CT scan and MRI facilities : ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ వీటికి శ్రీకారం చుట్టారు. దీంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆస్పత్రులలో సీటీ స్కాన్‌లతో పాటు, ఎంఆర్‌ఐ సదుపాయాల కల్పన షురూ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో కేవ‌లం 7 ఆసుప‌త్రుల్లో మాత్ర‌మే సీటీస్కాన్లు అందుబాటులో ఉన్నాయి.. టెక్నాల‌జి, సాప్ట్‌వేర్ అప్‌డేట్ చేయ‌లేదు..ఈ ప‌రిస్థితి నుంచి పూర్తిగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను అన్నింటిని కూడా మార్చ‌బోతున్నామని సీఎం తెలిపారు. ఈ రెండేళ్ల‌లో మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని జగన్ తెలిపారు.

నాడు-నేడు కార్య‌క్ర‌మంలో ఉన్న 11 ఆసుప‌త్రుల‌ను జాతీయ స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తున్నామని, టీచింగ్ కం న‌ర్సింగ్ కాలేజీని ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వీటిని కూడా ఆరోగ్య‌శ్రీ‌లోకి తీసుకువ‌స్తామన్న సీఎం, ఆరోగ్య‌శ్రీ రోగుల‌కు ఉచితంగా డ‌య‌గ్న‌సిస్ ప్రాసెస్ అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు.  మిష‌న‌రీ ఎప్పుడు కూడా అప్‌గ్రేడేడ్‌గా బాగా ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read also : Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!