Cricket cases : ‘లాక్ డౌన్ కదా…’ అని రోడ్లపై క్రికెట్ ఆడేస్తే అంతే.. ఇప్పటికే సిటీలో 85 కేసులు నమోదు చేసిన పోలీసులు
Cricket cases in Lockdown : జంటనగరాల్లో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లపై క్రికెట్ ఆడుతున్న వారిపై పోలీస్ శాఖ కొరడా ఝలిపిస్తోంది...

Cricket cases in Lockdown : జంటనగరాల్లో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లపై క్రికెట్ ఆడుతున్న వారిపై పోలీస్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయ్ కదాని ఇష్టానికి క్రికెట్ ఆడేస్తోన్న పది మందిపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసామియా బజార్ పిట్టల బస్తీలో నివాసం ఉండే పది మంది యువకులు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు. ఇది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా రోడ్లపై క్రికెట్ ఆడుతున్న వారిపై మంగళవారం ఒక్కరోజే సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 85 కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి చెప్పారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా లాక్ డౌన్ అమలు చేస్తుంటే, ఇంట్లో ఉండకుండా రోడ్లపైకి వచ్చి క్రికెట్ ఆడ్డంవల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉందని ఈ విషయాన్ని యువత గుర్తించాలని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
Read also :Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్