EETALA RAJENDAR: ఛాలెంజింగ్ ధోరణి.. అంతలోనే సంధి యోచన.. ఆ వెంటనే అమీతుమీ.. అసలు ఈటల వ్యవహారంలో జరిగిందిదే !

తెలంగాణలో రాజకీయ వేడిని రాజేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిస్థితి కాస్త చక్కబడుతున్నట్లే కనిపించినా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

EETALA RAJENDAR: ఛాలెంజింగ్ ధోరణి.. అంతలోనే సంధి యోచన.. ఆ వెంటనే అమీతుమీ.. అసలు ఈటల వ్యవహారంలో జరిగిందిదే !
Telangana
Follow us

|

Updated on: May 19, 2021 | 5:39 PM

EETALA RAJENDAR HOT POLITICS IN HUZURABAD: తెలంగాణ (TELANGANA)లో రాజకీయ వేడిని రాజేసిన మాజీ మంత్రి (FORMER MINISTER) ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిస్థితి కాస్త చక్కబడుతున్నట్లే కనిపించినా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కేసీఆర్ (OPERATION KCR) అంటూ.. 48 గంటల వ్యవధిలోనే ఈటలను పదవీచ్యుతున్ని చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CHIEF MINISTER K CHANDRASHEKHAR RAO) ఓదశలో మెత్తబడుతున్నారని కథనాలు వచ్చాయి. దానికి కారణం తనకు రాజకీయ గురువు కేసీఆరే (KCR)నని, ఆయనతో ఢీ కొనే ఉద్దేశం తనకేమాత్రం లేదని ఈటల తనను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా సీఎంకు సంకేతాలు పంపడమే. కొందరు పార్టీ సీనియర్ల సలహాలతో కేసీఆర్‌తో సయోధ్యకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్లు.. దానికి కేసీఆర్ ‌కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారని ఓ ఆంగ్ల మీడియా కథనం కూడా రాసింది. కానీ అనూహ్యంగా వారం రోజుల వ్యవధిలోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. బిడ్డా నీ సంగతి తేలుస్తానంటూ ఈటల ఘీంకరించడం.. దానికి ప్రతిగా.. మాటలు సక్కగా రానీయ్ లేకపోతే.. నేను నోరు విప్పితే తట్టుకోలేవ్ ఈటల అంటూ మంత్రి గంగుల కమలాకర్ (GANGULA KAMALAKAR) ఆవేశపడడం కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి. తాజా పరిణామాలు చూస్తే ఇక గులాబీ దళంలో ఈటల పాత్ర ముగిసినట్లేనని ఖరారైంది. అయితే.. ఇంతకూ గత 20 రోజులుగా ఏం జరిగింది? ఈ అంశంలో రాజకీయ పరిశీలకులు విభిన్నమైన విశ్లేషణలు ఇస్తున్నారు.

మే నెల ప్రారంభంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఎలాగైతే తెలంగాణను ఉధృతంగా తాకిందో.. అంతే వేగంగా అనాటి మంత్రి ఈటల రాజేందర్‌పై ఆపరేషన్ కేసీఆర్ మొదలైంది. హైదరాబాద్ (HYDERABAD) నగర శివారుల్లోని శామీర్ పేట (SHAMEERPET) ఏరియాలో ఈటల అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని, ఏకంగా రోడ్లనే నిర్మిస్తున్నారని కొందరు రైతులు ముఖ్యమంత్రి (CHIEF MINISTER)కి ఫిర్యాదు చేశారు. దానిపై అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TELANGANA RASHTRA SAMITI)కి అనుబంధంగా నడిచే టీవీ ఛానెల్ వేగంగా స్పందించింది. రైతులు చేస్తున్న ఆరోపణలకు ఇవే సాక్ష్యాలంటూ కొన్ని కథనాలను ఆ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇదంతా గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అందరు భావించారు. ఈటల మంత్రి పదవి వూడడం ఖాయమని అంఛనా వేశారు. అనుకున్నట్లుగానే సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికార బృందం ఈటలపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవముందంటూ నివేదిక అందించారు. ఇలా నివేదిక అందడం.. అలా మంత్రి పదవి నుంచి ఈటలను తప్పించాలంటూ సీఎం కేసీఆర్ గవర్నర్ (GOVERNOR)‌ను కోరడం.. ఆ వెంటనే గవర్నర్ ఈటలను బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇది జరిగిన తర్వాత ఓ వారం రోజుల పాటు ఈటల కదలికలు ఎవరికీ పెద్దగా తెలియలేదు. తన శామీర్‌పేట ఫామ్ హౌజ్‌లో రెండు, మూడు రోజులు గడిపిన ఈటల ఓ దఫా తన నియోజకవర్గానికి వెళ్ళి వచ్చారు. ఈక్రమంలోనే కొందరు టీఆర్ఎస్ (TRS) అసంతృప్తవాదులు.. గులాబీ పార్టీ నుంచి ఆల్‌రెడీ బయటికి వచ్చిన వారు.. ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు (CONGRESS LEADERS) రాజేందర్‌ను కలిసినా.. పెద్దగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఈ క్రమంలోనే ఈటల రాజీనామా చేయకుండా.. గులాబీ బాస్‌తో రాజీకి యత్నిస్తున్నారంటూ ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. అయితే.. ఆ తర్వాత పరిణామాలు కేసీఆర్‌లో తిరిగి ఆగ్రహాన్ని రాజేశాయని తాజా సమాచారం. ఈటలను పార్టీ నుంచి తొలగించాలంటూ పలువురు మంత్రులు గులాబీ దళపతిని కోరినా ఆయన వెంటనే చర్యలు తీసుకోలేదు. ఈక్రమంలో రాజీ వార్తలు నిజమేనని కొందరు పరిశీలకులు భావించారు. కానీ.. ఈటలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC WORKING PRESIDENT) భట్టి విక్రమార్క (BHATTI VIKRAMARKA) కలిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు (RAJYASABHA MEMEBER), చిరకాలంగా అధిష్టానానికి దూరంగా వుంటూ పొలిటికల్ స్కెచ్ (POLITICAL SKETCH)‌లు వేస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు, బీసీ నేత డి.శ్రీనివాస్ (D SRINIVAS)‌ను స్వయంగా ఆయనింటికి వెళ్ళి మరీ ఈటల కల్వడంతో కేసీఆర్ ఆగ్రహజ్వాలను మరింత రాజేసింది. దాంతో ఈటల పార్టీ మారతారని కేసీఆర్ ధృవీకరించుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈటల వెంట హుజూరాబాద్ (HUZURABAD) టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ వీడకుండా చర్యలకు ఆదేశించారు. కేసీఆర్ డైరెక్షన్.. కేటీఆర్ యాక్షన్ ప్లాన్ వెరసి.. హుజూరాబాద్‌పై మంత్రి గంగుల కమలాకర్ దృష్టి సారించారు. నయానాభయానా గులాబీ శ్రేణులు ఈటల రాజేందర్ వెంట వెళ్ళకుండా యత్నాలను ముమ్మరం చేశారు.

ఈ సంగతి తెలియడంతో ఈటల ఆగ్రహానికి గురయ్యారు. ఇక గులాబీ బాస్‌తో అమీతుమీయే సరైన బాట అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత నిర్దిష్ట కార్యాచరణ ప్రకారం ముందుగా తన తండ్రి ఆశీస్సులు తీసుకుని.. గులాబీ దళపతి కేసీఆర్‌ను పరోక్షంగాను.. మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రత్యేక్షంగాను ఓ ఆట ఆడేసుకున్నారు. బిడ్డా నీ సంగతి నాకెరుకేనంటూ గంగులపై ఘీంకరించారు ఈటల. ఈటల ప్రెస్ కాన్ఫరెన్సు ఇలా పూర్తి అయ్యిందో లేదో.. అటు గంగుల తెరమీదకి వచ్చారు. నేనూ బీసీ బిడ్డనే.. బిడ్డా అని నన్నంటే.. నేనందుకునే భాషతో నువ్వు తట్టుకోలేవంటూ ఈటలను హెచ్చరించారు గంగుల. దాంతో హుజూరాబాద్‌ రాజకీయ వేడి కరీంనగర్ (KARIMNAGAR)‌ను తాకింది. రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. 2018 నుంచి ఉప్పు నిప్పులా ఉంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్‌ మీడియా ముందే పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు ఈటలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఉంటామని చెపుతూ గంగులను కలుస్తుండడంతో ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది. మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జీలను నియమించి నాయకులను తనకు కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో గంగుల పేరు ప్రస్తావించకుండా ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల చేసిన వ్యాఖ్యలతో అలర్ట్‌ అయిన మంత్రి గంగుల కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్‌ ఇచ్చారు. తనపై మాజీ మంత్రి ఈటల చేసిన విమర్శలను తోసిపుచ్చుతూనే పలు ఆరోపణలు చేశారు. ఈటల పేరును ప్రస్తావిస్తూ మంత్రి ఘాటైన విమర్శలు చేయడంతోపాటు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం గమనార్హం.

గంగుల డిమాండ్ కావచ్చు.. ఇక గులాబీ బాస్‌తో పూర్తి స్థాయి తెగదెంపులు కావచ్చు.. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. డి. శ్రీనివాస్ తరహాలో రాజీనామా చేయకుండా పూర్తి యాక్షన్ తీసుకునే దాకా వేచి చూసే ఆప్షన్ కూడా ఈటలకు వుంది. అధిష్టానంతో దాదాపు మూడేళ్ళుగా దూరంగా వున్న డీఎస్.. తన రాజ్యసభ పదవిని మాత్రం వదులుకోవడం లేదు. ఇదే ఉపదేశాన్ని గనక డీఎస్.. ఈటలకు ఉపదేశించి వుంటే ఈటల తనపై చర్య తీసుకునే దాకా రాజీనామా చేయకపోవచ్చు. కానీ రాజకీయ వాగ్బాణాలు తీవ్రమైన నేపథ్యంలో రాజీనామాకు కూడా మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఈ క్రమంలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్‌రావు (MINISTER HARISH RAO)కు హుజూరాబాద్ గెలుపు బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పార్టీ ఉన్నట్లు ఈటల మాటలను బట్టి అర్థమవుతోంది. హరీశ్ రావును రంగంలోకి దింపుతారని ముందుగానే అంఛనా వేస్తున్న ఈటల.. ఎక్కడికి వెళ్ళినా గెలిపిస్తాడు అని పేరున్న ఓ మంత్రిని హుజూరాబాద్‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.. 20 ఏళ్ళు హుజూరాబాద్ ప్రజలు నా వెంట వున్నారు… ఆ ట్రబుల్ షూటర్‌కు తామేంటో చూపిస్తారంటూ ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఉద్యమ కాలం నుంచి ఈటలకు సన్నిహితుడిగా పేరున్న హరీశ్‌ వ్యూహాలతోనే రాజేందర్‌కు చెక్‌ పెట్టించాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ప్రెసిడెంట్ బైడెన్ సరికొత్త వ్యూహం.. ఆ చర్యల వెనుక అదే లక్ష్యం!