Covid vaccines: కోవిడ్ టీకాల సరఫరాకు తెలంగాణ సర్కార్ గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం
Global e-Tenders: తెలంగాణ కోవిడ్ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర సర్కార్ ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయల మౌలిక వసతుల సంస్థ (TSMIDC) ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచిందింది. నెలకు కనీసం..
తెలంగాణ కోవిడ్ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర సర్కార్ ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయల మౌలిక వసతుల సంస్థ (TSMIDC) ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచిందింది. నెలకు కనీసం 15 లక్షల డోసులు సరఫరా చేయాలని.. ఆరు నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. టెండర్ల ధాఖలకు ఈ నెల 21 వరకు అవకాశం కల్పించింది.
ఈ మేరకు ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం సేకరించనుంది. ఆన్‌లైన్ ద్వారా బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులను విధిగా సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వాలని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
Telangana Government has invited short term Global e-tender for the supply of 10 million doses of COVID19 vaccine to Telangana State Medical Services and Infrastructure Development Corporation pic.twitter.com/ifDCezge16
— ANI (@ANI) May 19, 2021