NRI Sentenced: భార్యపై వేధింపులు.. ఎన్నారైకి 56 నెలల జైలు శిక్ష విధించిన టెక్సాస్ కోర్టు
NRI Sentenced: అమెరికాలోని టెక్సాస్ లో ఒక ఎన్నారైకి 56 నెలల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తి అయిన తరువాత అతనిని ఇండియా పంపించి వేస్తారు.
NRI Sentenced: అమెరికాలోని టెక్సాస్ లో ఒక ఎన్నారైకి 56 నెలల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తి అయిన తరువాత అతనిని ఇండియా పంపించి వేస్తారు. టెక్సాస్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీల్ కె. ఆకుల తన భార్యను వేధింపులకు గురిచేసినందుకు, ఆమెను కిడ్నాప్ చేసినందుకు అలాగే ఆమెపై చేయిచేసుకున్నందుకు గానూ అతనికి ఈ శిక్ష విధించారు. గత నవంబర్ లో ఈ నేరాలకు పాల్పైనందుకు అతనిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. 2019 ఆగస్ట్ 6వ తేదీన సునీల్ టెక్సాస్ లోని తన ఇంటినుంచి అగ్వాం వెళ్ళాడు. అక్కడ ఉన్న తన భార్యను బెదిరించి.. తనతో పాటు టెక్సాస్ వచ్చేయాలని కోరాడు. ఆమెను తన అపార్ట్ మెంట్ నుంచి వచ్చి కారు ఎక్కమనీ.. తనతో టెక్సాస్ వచ్చేయమనీ బలవంతం చేశాడు. అలానే బలవంతంగా తన కారులో ఎక్కించుకుని టెక్సాస్ బయలు దేరాడు. అక్కడ నుంచి నేరుగా టెక్సాస్ పోకుండా.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కారును తిప్పుతూ ఆమెను వేధిస్తూ వచ్చాడు. తరువాత ఆమెను కారులోనే కొట్టి.. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని వేధించాడు. ఆమెను వెంటనే తన కంపెనీకి రిజిగ్నేషన్ ఈ మెయిల్ చేయమని గొడవ చేశాడు. తరువాత ఆమె లాప్ టాప్ ను ధ్వంసం చేసి కారులోంచి బయటకు హైవే పైకి విసిరేశాడు.
ఆ తరువాత సునీల్ ఆకుల నాక్స్ కౌంటీ లోని టేనస్సీ హోటల్ కు తన భార్యను తీసుకువెళ్ళాడు. అక్కడ మళ్ళీ మరోసారి తనను దారుణంగా కొట్టాడు. ఆతరువాత హోటల్ రూమ్ ఖాళీ చేస్తున్న సమయంలో అక్కడి స్థానిక పోలీసులు అతనిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ అయిన తరువాత సునీల్ ఇండియాలోని తన బంధువులకు ఫోన్ చేసి తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేయమని కోరాడు. వారిని తన భార్యతో మాట్లాడించి తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని చెప్పమని చెప్పాడు. ఈ ఆరోపణలు అన్నీ రుజువు కావడంతో సునీల్ ఆకుల కు 56 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు.. శిక్షాకాలం పూర్తయిన తరువాత అతనిని భారతదేశం పంపించేయాలని అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. ఇతను ఇండియాలో ఏ ప్రాంతం వాడు.. ఇతర వివరాలు తెలియరాలేదు.
Also Read: గాజా సిటీలో మరణ మృదంగం, 215 మంది మృతి, ఆ కుటుంబమంతా మృత్యుముఖంలోకి, 5 నెలల చిన్నారి క్షేమం