AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

cannabis : జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం రాజస్థాన్ ధాబా దగ్గర 240 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

Ganja caught : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.

cannabis : జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం రాజస్థాన్ ధాబా దగ్గర 240 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్
Ganja
Venkata Narayana
|

Updated on: May 19, 2021 | 3:40 PM

Share

Ganja caught : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. రామవరం వద్ద రాజస్థాన్ ధాబా హోటల్ దగ్గర పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తనిఖీలు చేపట్టారు. జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ నేతృత్వంలోని పోలీస్ బృందం అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి బయటపడింది. ఈ తనిఖీలలో జగ్గంపేట ఎమ్మార్వో సరస్వతి సహా, ఇద్దరు వీఆర్వోలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు సిందోల్ రవీందర్ రెడ్డి, హోదగల్ రంజిత్ రెడ్డి, సయ్యద్ ఆరిఫ్ సామి, మేకల రామకృష్ణ అనే వీళ్లు TS 12 EL 8906 నెంబరు గల ఇన్నోవా కారు అద్దెకు తీసుకుని అన్నవరం వచ్చారు. ఆ తర్వాత వైజాగ్ నుండి AP 31 CU 4131 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారు ను అద్దెకు తీసుకుని రప్పించారు. ఈ యువకులు రెండు రోజులు అన్నవరంలో విశ్రాంతి తీసుకుని తరువాత దారకొండ వెళ్లి లోవ రాజు అనే వ్యక్తి సహాయంతో గంజాయి కేజీ రెండు వేల రూపాయలు చొప్పున 240 కేజీల గంజాయి కొనుగోలు చేసి ఈ కార్లలో బయలుదేరారు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ ఒక కేజీ ఐదు వేలు నుండి ఆరు వేల రూపాయలకు విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఐతే మార్గంమధ్యలో రామవరం జాతీయ రహదారి పై రాజస్థాన్ హోటల్ దగ్గరికి వచ్చేసరికి ఇన్నోవా కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ కారును రిపేర్ చేయించుకునే సరికి పన్నెండు గంటలు దాటింది. 12 దాటితే రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉండడం వలన పోలీసు నిఘా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుకి అక్కడే ఉండి తర్వాత రోజు బయల్దేరదామని అనుకున్నారు.

ఇంతలో ఈ సమాచారం జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణకు అందిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ దగ్గర అనుమతి తీసుకుని జగ్గంపేట ఎమ్మార్వో, ఇద్దరూ వీఆర్వో లు కలిపి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, 9700 రూపాయల నగదు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. సిందోల్ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పై గతంలో గంజాయి కేసులున్నాయని మేకల రామకృష్ణ అనే యువకుడుకు ఇంకా మైనారిటీ తీరలేదని పోలీసులు తెలియజేశారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జగ్గంపేట సీఐ సురేష్ బాబు సూచించారు.

Read also : Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..