Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Mallya: విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్.. కింగ్ ఫిషర్ ఆస్తులపై కవర్ ఎత్తివేత.. భారత బ్యాంకులకు ఊరట!

Vijay Mallya: బ్యాంకులను నిలువునా కోట్లాది రూపాయలకు ముంచేసి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది.

Vijay Mallya: విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్.. కింగ్ ఫిషర్ ఆస్తులపై కవర్ ఎత్తివేత.. భారత బ్యాంకులకు ఊరట!
Vijay Mallya
Follow us
KVD Varma

|

Updated on: May 19, 2021 | 6:18 AM

Vijay Mallya: బ్యాంకులను నిలువునా కోట్లాది రూపాయలకు ముంచేసి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. లండన్ హైకోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. కోర్టు వెలువరించిన ఈ నిర్ణయం తరువాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విజయ్ మాల్యా ఆస్తులను అమ్మడం ద్వారా రికవరీ చేసుకోవడానికి మార్గం సులభతరం అయింది. లండన్ హైకోర్టు భారతదేశంలో మాల్యా ఆస్తిపై ఇంతకు ముందు విధించిన భద్రతా కవర్ ను ఉపసంహరించుకుంది. దీనితో, ఎస్బీఐ నేతృత్వంలోని భారత బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుండి రుణాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశంలో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా మూసివేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాన్ని ఇప్పుడు భారత బ్యాంకులు తిరిగి పొందగలవు. ఏప్రిల్‌లో లండన్ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం పారిపోయిన వ్యాపారవేత్త నుంచి రుణాల రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. మూసివేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలు రుణపడి ఉన్నారు.

తాజాగా భారతీయ బ్యాంకులకు అనుకూలంగా లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది, భారతీయ బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పిటిషన్ చట్టం పరిధికి వెలుపల ఉందని మాల్యా పేర్కొన్నారు. లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ భారత బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు, మాల్యా ఆస్తులకు భద్రతా హక్కులను కల్పించే ప్రజా విధానం లేదని అన్నారు.

ఇప్పుడు ఏం జరగొచ్చు.. యూకేలో అప్పగించే కేసును విజయ్ మాల్యా కోల్పోయినా, యూకే హోం మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ, మాల్యాను భారతదేశానికి రప్పించడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. 9,000 కోట్ల రూపాయల నష్టంతో భారతదేశం నుండి తప్పించుకున్న విజయ్ మాల్యాను రప్పించడంలో ఆలస్యం కావడం తప్పదు. అయితే, అయన ఆస్తులను వేలం వేయడానికి మాల్యా భారతదేశానికి రావలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి అవకాశాన్నీ భారత బ్యాంకుల కన్సార్టియం ప్రయత్నిస్తోంది. తానను లండన్ లోనే ఉంచాలని మాల్యా యూకే కోర్టుల్లో వేసిన కేసు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు, అయితే, ఇప్పటికీ మాల్యా తన తెలివితేటలతో యుకెలో నివసించడానికి మరికొన్ని రోజులు సమయం పొందవచ్చు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మాల్యా బ్రిటన్‌లో ఉండటానికి దాదాపు అన్ని చట్టాలు మూసివేయబడ్డాయని నిపుణులు అంటున్నారు.

Also Read: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు..!

ఎలాన్ మస్క్ ఆస్తులు కరిగిపోతున్నాయి.. ప్రపంచ కుబేరుల జాబితా నుంచి జారీపోతున్నాడు..ఎందుకో తెలుసా…?