లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు..!
లండన్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు పెద్ద షాకిచ్చింది. తనను భారత్ కు అప్పగించాలంటూ యూకే హోమ్ మంత్రి సాజిద్ జావిద్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించింది. దీంతో త్వరలోనే మాల్యాను భారత్ కు అప్పగించడం జరగనుంది. విజయ్ మాల్యాను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న భారత ప్రభుత్వ హామీకి లండన్ కోర్టు ఓకే […]
లండన్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు పెద్ద షాకిచ్చింది. తనను భారత్ కు అప్పగించాలంటూ యూకే హోమ్ మంత్రి సాజిద్ జావిద్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించింది. దీంతో త్వరలోనే మాల్యాను భారత్ కు అప్పగించడం జరగనుంది. విజయ్ మాల్యాను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న భారత ప్రభుత్వ హామీకి లండన్ కోర్టు ఓకే చెప్పింది. ఈడీ, సీబీఐ అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడం తప్పనిసరని భావించింది. కాగా విజయ్ మాల్యా భారతీయ బ్యాంకుల నుంచి రూ.9,000 కోట్లకు పైగా కుంభకోణం చేసి బ్రిటన్ కి పారిపోయిన సంగతి తెలిసిందే.