‘నేను పక్కా లోకల్’: పొన్నం ప్రభాకర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీ వీడుతానంటూ వస్తున్న వార్తలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వీడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారిని విస్మరించారని దుయ్యబట్టారు. ‘ఉద్యమకారులకు ఔట్.. తెలంగాణ వ్యతిరేకులకు ఇన్‌’ గా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. ఉద్యమ సమయంలో తనను పొగిడిన కేసీఆర్.. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఓటు వేయమంటున్నారని అన్నారు. వినోద్ కుమార్ తనపై […]

‘నేను పక్కా లోకల్': పొన్నం ప్రభాకర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 08, 2019 | 4:31 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీ వీడుతానంటూ వస్తున్న వార్తలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వీడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారిని విస్మరించారని దుయ్యబట్టారు. ‘ఉద్యమకారులకు ఔట్.. తెలంగాణ వ్యతిరేకులకు ఇన్‌’ గా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. ఉద్యమ సమయంలో తనను పొగిడిన కేసీఆర్.. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఓటు వేయమంటున్నారని అన్నారు. వినోద్ కుమార్ తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వినోద్ స్థానికేతరుడు కాబట్టే జిల్లాకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాను పక్కా లోకల్ అని, అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.