PM Modi Crash Course: రూపు మార్చుకుంటున్న వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.. కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సు ప్రారంభించిన ప్రధాని

రోజుకో కొత్త రూపం దాల్చుతున్న కరోనా మహమ్మారితో దేశం పెను సవాళ్లను ఎదుర్కొనే ముప్పుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు

PM Modi Crash Course: రూపు మార్చుకుంటున్న వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.. కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సు ప్రారంభించిన ప్రధాని
Pm Modi Launches Customised Crash Course
Follow us

|

Updated on: Jun 18, 2021 | 3:18 PM

PM Modi launches customised crash course: రోజుకో కొత్త రూపం దాల్చుతున్న కరోనా మహమ్మారితో దేశం పెను సవాళ్లను ఎదుర్కొనే ముప్పుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సమయంలో అది నిరూపితమైందని అన్నారు. ఆ మహమ్మారి వైరస్ లో మ్యూటేషన్లు జరిగే ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఇక, నిరంతరం కరోనా పోరాటంలో మనం సన్నద్ధతను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కోవిడ్ యోధులకు కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సును ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా లక్ష మందిలో పని సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా..26 రాష్ట్రాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. కరోనా రోగులకు సేవలు, శాంపిల్స్ కలెక్షన్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా ప్రధాని కౌశల్ వికాస్ యోజన కింద 276 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ దేశానికి సవాల్‌ విసురుతోందన్నార. కొత్త కొత్త స్ట్రెయిన్స్‌ విసురుతున్న సవాళ్ళను.. సెకండ్ వేవ్‌లో గమనించామని.. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరింతగా ఉత్పరివర్తనం చెందే అవకాశం ఉందన్నారు. ఆ వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు మనం మరింత ఎక్కువగా సిద్ధమవాలని తెలిపారు. ఈ లక్ష్యంతోనే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కోర్సుల ద్వారా దాదాపు లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కస్టమైజ్డ్ క్రాష్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్న్నట్లు ప్రధాని తెలిపారు. ​ఈ క్రాష్​ కోర్స్​లో శిక్షణ పొందినవారు కరోనాపై పోరులో పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే, ఆస్పత్రులకు వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌ పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు, మౌలిక వసతుల కల్పన, కరోనా చికిత్సలు, దానికి సంబంధించిన వైద్య పరికరాల సమీకరణ వంటి విషయాల్లో భారత్ కు అతిపెద్ద నెట్ వర్క్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసుపత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 1,500 ఆక్సిజన్ ప్లాంట్​లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని..అన్ని జిల్లాలకు మెడికల్ ఆక్సిజన్​ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణను ఇవ్వనున్నారు. హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ సేకరణ, వైద్య పరికరాలకు సంబంధించిన అంశాల్లో వారికి శిక్షణను ఇస్తారు. దీంతో ప్రస్తుతం, భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరత కొద్దిగా తీరే అవకాశం ఉంటుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

Read Also….  MP Vijayasai Reddy: ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బందీ లేదు.. విశాఖ ఫ్రంట్ లైన్ వర్కర్లకు మందు అందించిన ఎంపీ విజయసాయిరెడ్డి