Bariatric Surgery for Dog: స్థూలకాయ శునకానికి బేరియాట్రిక్ సర్జరీ… దేశంలోనే తొలిసారిగా జంతువుకు..

Bariatric Surgery For Pet: దేశంలో తొలిసారిగా పెంపుడు జంతువుకు స్థూల కాయం తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. స్థూల కాయం తగ్గడానికి మనుషులకు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించడం సాధారణమే.

Bariatric Surgery for Dog: స్థూలకాయ శునకానికి బేరియాట్రిక్ సర్జరీ... దేశంలోనే తొలిసారిగా జంతువుకు..
పూణెలో పెంపుడు శునకానికి బేరియాట్రిక్ సర్జరీ
Follow us

|

Updated on: Jun 18, 2021 | 3:21 PM

Bariatric Surgery For Dog: దేశంలో తొలిసారిగా పెంపుడు శునకానికి బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. స్థూల కాయం తగ్గడానికి మనుషులకు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించడం సాధారణమే. తాజాగా మహారాష్ట్రలో ఇండీ క్రాస్ బ్రీడ్(దేశీ సంకరజాతి కుక్క) కు చెందిన ఏడేళ్ల వయసు పెంపుడు కుక్క కు విజయవంతంగా బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. దేశంలో ఓ జంతువుకు జరిగిన తొలి బేరియాట్రిక్ సర్జరీ ఇదే కావడం విశేషం. దీపికా అనే పేరున్న ఈ కుక్కను పుణెకు చెందిన కుటుంబం పెంచుకుంటోంది. కొన్నేళ్లుగా దీపికా విపరీతంగా బరువు పెరిగిపోయింది. 50 కేజీల బరువున్న దీపికా కదలికలు, ఉత్సాహం తగ్గడం, నడవలేకపోవడాన్ని గుర్తించిన దాని యజమాని…వెటర్నరీ డాక్టర్లను సంప్రదించారు. వైద్య పరీక్షలో దీపిక కడుపులో వ్యాధిని వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. కాలేయం, మూత్ర పిండాలు, గుండె, అధిక రక్తపోటు, కాటరాక్ట్, థైరాయిడ్, హెర్నియా తదితర అవయవాల పనితీరు మందగించడాన్ని పరీక్షల్లో గుర్తించారు. దీంతో ఆ శునకానికి వెటర్నరీ డాక్టర్ల బృందం గత వారం బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించింది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత దీపిక హుషారుగా నడుస్తోంది.

కడుపులో ఉత్పత్తి అయ్యే గ్రేలిన్ హార్మోన్ అధికమైతే శరీరం పనిచేసే ప్రక్రియ మందగిస్తుంది. దీపిక ఈ సమస్య కారణంగానే బరువు పెరిగినట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. బేరియాట్రిక్ సర్జరీలో ఒకటైన…లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చికిత్స ద్వారా 50 కిలోల దీపికా బరువును 5 కిలోలు తగ్గించారు. దీపిక కడుపు(జీర్ణశయం)ను 70 శాతం తొలగించినట్లు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. స్థూల కాయులు ఎక్కువ తినకుండా జీర్ణాశయం పరిమాణం తగ్గించడమే ఈ శస్త్ర చికిత్స ప్రధాన ఉద్దేశం. ఈ చికిత్సలో భాగంగా దీపిక జీర్ణాశయంలో కొంత భాగం తొలగించి..దాని పరిమాణం 30 శాతానికి తగ్గించి జీర్ణాశయానికి కుట్లు వేశారు.

ఫలితంగా దీపిక బరువు తగ్గటమే కాకుండా… అది తక్కువగా తిన్నప్పటికీ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. సర్జరీ తర్వాత దీపిక కాస్త చురుగ్గా ఉంటున్నట్లు దాని యజమాని తెలిపారు. దీపిక ఇంట్లో కలివిడిగా తిరుగుతుందని వెల్లడించారు. దీపిక పూర్తి హుషారుగా తిరగాలంటే మరికొన్ని రోజులు పడుతుందని దానికి బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించిన వైద్యులు తెలిపారు.

Also Read.. లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం

Robbery: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. వ్యాపారి ఇంట్లో రూ. 40 లక్షల వజ్రాలు, రత్నాలు దోపిడి..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.