కిడారి రాజీనామా
ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో పదవికి రాజీనామా చేసిన కిడారి.. తన రాజీనామా లేఖను ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రకు అందజేశారు. మంత్రిగా గతేడాది బాధ్యతలు స్వీకరించిన కిడారి.. ఆరు నెలల్లోపు ఏ చట్టసభల్లోనూ సభ్యుడిగా ఎన్నిక కాలేదు. దీంతో ఆయన రాజీనామా చేయడం అనివార్యమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా గిరిజన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని […]

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో పదవికి రాజీనామా చేసిన కిడారి.. తన రాజీనామా లేఖను ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రకు అందజేశారు. మంత్రిగా గతేడాది బాధ్యతలు స్వీకరించిన కిడారి.. ఆరు నెలల్లోపు ఏ చట్టసభల్లోనూ సభ్యుడిగా ఎన్నిక కాలేదు. దీంతో ఆయన రాజీనామా చేయడం అనివార్యమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా గిరిజన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. నిబంధనల మేరకే రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు.



