‘హుజూర్’..! కేసీఆర్ వ్యూహంలో కేకే..! ‘కమలానికి’ నో వే..!

'హుజూర్'..! కేసీఆర్ వ్యూహంలో కేకే..! 'కమలానికి' నో వే..!

టీఆర్ఎస్‌లోని సీనియర్ నేతల్లో కె.కేశవరావు(కేకే)ఒకరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వస్తోన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పార్టీలో కేసీఆర్ తరువాత వినిపించే పెద్ద నేతల లిస్ట్‌లో కేకే పేరు కచ్చితంగా ఉంటుంది. ఇక ఇంతవరకు కేసీఆర్ చెబితే తప్ప.. ఏ విషయాన్ని కేకే మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. అలాంటి ఉన్నట్లుండి ఆయన ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వానికి, […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 12:58 PM

టీఆర్ఎస్‌లోని సీనియర్ నేతల్లో కె.కేశవరావు(కేకే)ఒకరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వస్తోన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పార్టీలో కేసీఆర్ తరువాత వినిపించే పెద్ద నేతల లిస్ట్‌లో కేకే పేరు కచ్చితంగా ఉంటుంది. ఇక ఇంతవరకు కేసీఆర్ చెబితే తప్ప.. ఏ విషయాన్ని కేకే మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. అలాంటి ఉన్నట్లుండి ఆయన ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేకే కోరారు. ఇందుకు ఆర్టీసీ జేఏసీ కూడా సానుకూలంగా స్పందించింది. కేకే ఆహ్వానిస్తే చర్చలకు వెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని చాలామంది భావించారు. కానీ ఆ మరుసటి రోజే ఆయన యూటర్న్ తీసుకున్నారు. చర్చలు చేపట్టడానికి తాను ఎవరిని అంటూ కేకే షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చర్చలకు దిగుతానని.. కానీ తనకు ఆయన అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదని కేకే చెప్పుకొచ్చారు. దీంతో కేకే వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యమేంటన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా కేకే రాజ్యసభ సభ్యత్వం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో కేకే వయసును దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్.. తన పార్టీ తరఫున ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపేందుకు సుముఖంగా లేరన్న టాక్ వినిపించింది. మరోవైపు నలుగురు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులతో సహా పార్టీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకే.. టీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన త్వరలోనే కాషాయ కండువాను కప్పుకోనున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఈ పుకార్లను ఆయన ఖండించారు. టీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని.. బీజేపీ సిద్ధాంతాలు తన రక్తంలో లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గురువారం హుజూర్‌‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన కేసీఆర్.. తన వెంట కేకేను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో ఆయనను వదులుకునేందుకు కేసీఆర్ కూడా సుముఖంగా లేరని అర్థమవుతోంది. మరి ఇప్పుడైనా కేకే పార్టీ మార్పు వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu