జేసీ మళ్లీ యూటర్న్.. జగన్‌‌పై ఓ రేంజ్‌లో విసుర్లు

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో..? ఎప్పుడు ఎవరిని తిడతారో తెలుసుకోవడం చాలా కష్టం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై అంతెత్తున లేచే దివాకర్ రెడ్డి.. ఓడిన తరువాత మాత్రం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘ఎవ్వరి మాట వినకుండా జగన్ తనదైన మార్కుతో పరిపాలన చేస్తున్నాడు. ఎంతైనా జగన్ మా వాడే. మావాడు చాలా తెలివైనవాడు. అతడి పరిపాలనకు వందకు 110 మార్కులు వేస్తాను’’ అంటూ వెనకేసుకొచ్చారు. ఇక తాజాగా మాత్రం జగన్‌పై […]

జేసీ మళ్లీ యూటర్న్.. జగన్‌‌పై ఓ రేంజ్‌లో విసుర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:46 PM

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో..? ఎప్పుడు ఎవరిని తిడతారో తెలుసుకోవడం చాలా కష్టం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై అంతెత్తున లేచే దివాకర్ రెడ్డి.. ఓడిన తరువాత మాత్రం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘ఎవ్వరి మాట వినకుండా జగన్ తనదైన మార్కుతో పరిపాలన చేస్తున్నాడు. ఎంతైనా జగన్ మా వాడే. మావాడు చాలా తెలివైనవాడు. అతడి పరిపాలనకు వందకు 110 మార్కులు వేస్తాను’’ అంటూ వెనకేసుకొచ్చారు. ఇక తాజాగా మాత్రం జగన్‌పై ఆయన గట్టిగానే సెటైర్లు వేశారు. జగన్‌కు అనుభవం లేదని, అతడికి చెప్పే వారు ఎవరూ పక్కన లేరని జేసీ అన్నారు. అంతటితో ఆగకుండా ఎవరు చెప్పినా.. జగన్ వినే రకం కాదని కూడా తేల్చేశారు.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు ఉంటాయని జగన్ అనుకుంటారని.. అందువల్లే ఆయన అదే టైప్‌లో పాలన చేస్తున్నారని పంచులేశారు. జగన్ పాలనలో మంచి చెడ్డా చెప్పమంటే ఇప్పుడు ఏం చెబుతామని ఆయన వెటకాడమాడారు. ఇక జగన్‌ను నరేంద్ర మోదీ సీఎం సీట్లో కూర్చొబెట్టారని.. ఆయన వేసిన మంత్రదండం ముందు మరే దండమూ పనిచేయదని జేసీ సెటైర్లు వేశారు. మరో ఏడాది ఆగితే జగన్ పాలన ఏంటన్నది పూర్తి పిక్చర్ వస్తుందంటూ జేసీ విసుర్లు విసిరారు.