ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్.. సర్వం సిద్ధం..

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ చివరి సారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత ఇక్కడ ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారం చేసేకేందుకు కేసీఆరే ప్రచార బరిలోకి దిగారు. హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రచారం అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. రామస్వామి గుట్ట వద్ద 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా […]

ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్.. సర్వం సిద్ధం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:48 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ చివరి సారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత ఇక్కడ ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారం చేసేకేందుకు కేసీఆరే ప్రచార బరిలోకి దిగారు. హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రచారం అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. రామస్వామి గుట్ట వద్ద 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా సీఎం సభ నిర్వహించారు. తాజాగా అక్కడి నుంచే మరోసారి ఆయన ప్రసంగించనున్నారు. ఈనెల 21న జరిగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించేందుకు.. మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన గిరిజనులు, మహిళల ఓట్లను రాబట్టేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనతో ప్రచారానికి ఊపు వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది.