ఆ సెంటిమెంట్‌తో అలీకి అదృష్టం కలిసొస్తుందా?

ఆ సెంటిమెంట్‌తో అలీకి అదృష్టం కలిసొస్తుందా?

ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, మరెన్నో వివాదాలతో బిగ్ బాస్ సీజన్ 3 చివరికి చేరుకుంది. హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్‌తో మొదలైన ఈ షో క్రమేపి సోసోగా మారిందని చెప్పొచ్చు. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి కంటెస్టెంట్ల పరంగా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్‌లు ఇవ్వలేదు. అలీ రెజాను మినహాయిస్తే.. మిగిలిన ఇంటి సభ్యులందరూ తేలిపోయారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్‌కు హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ‘బిగ్ […]

Ravi Kiran

| Edited By:

Oct 17, 2019 | 12:23 PM

ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, మరెన్నో వివాదాలతో బిగ్ బాస్ సీజన్ 3 చివరికి చేరుకుంది. హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్‌తో మొదలైన ఈ షో క్రమేపి సోసోగా మారిందని చెప్పొచ్చు. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి కంటెస్టెంట్ల పరంగా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్‌లు ఇవ్వలేదు. అలీ రెజాను మినహాయిస్తే.. మిగిలిన ఇంటి సభ్యులందరూ తేలిపోయారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్‌కు హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ‘బిగ్ బాస్’ షోను ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సీజన్ల విన్నర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రియాలిటీ షోకు ’11’ సెంటిమెంట్ కుదిరినట్లే కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మొదటి బిగ్ బాస్ సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా శివ బాలాజీ అడుగుపెట్టి.. విన్నర్‌గా గెలిచాడు. అలాగే రెండో సీజన్‌లో కౌశల్ మందా 11వ కంటెస్టెంట్ కావడం.. అనూహ్యంగా విజయం సాధించడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా 11వ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా బిగ్ బాస్ విన్నర్‌‌గా అవతరిస్తాడని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది సాధ్యం కాదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అలీ రెజా ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ హౌస్‌లోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళెవరూ చివరి వరకు హౌస్‌లో ఉండలేదు. అంతేకాక రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలీలో మునపటి జోష్ తగ్గిందనే చెప్పాలి. కానీ అతడికి మాత్రం బయట అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఈ వారం ఓటింగ్‌ను పరిశీలిస్తే.. అలీ రెజాకు సోసోగానే ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది బిగ్ బాస్ కాబట్టి.. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇప్పటివరకు వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌లు టైటిల్ వేటలో ముందు ఉండగా… అనూహ్యంగా ఈ రేస్‌లోకి అలీ రెజా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu