AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాప్‌ల నుంచి భర్తను గట్టెక్కిస్తుందా..!

టాలీవుడ్‌లో ఉన్న వైవిధ్య దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన ఈ దర్శకుడు.. ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ రీమేక్‌కు కృష్ణ వంశీ […]

ఫ్లాప్‌ల నుంచి భర్తను గట్టెక్కిస్తుందా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 17, 2019 | 6:56 PM

Share

టాలీవుడ్‌లో ఉన్న వైవిధ్య దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన ఈ దర్శకుడు.. ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

రంగమార్తాండ పేరుతో ఈ మూవీ తెరకెక్కబోతుండగా.. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

కాగా కృష్ణవంశీ, రమ్యకృష్ణ భార్య భర్తలన్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రలేఖ’, ‘శ్రీ ఆంజనేయం’ చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు స్టార్ట్ అయ్యాయి.

Follow Us
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్