AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీని పరోక్షంగా గెలిపిస్తున్న ఎంఐఎం..! అసలు కథ వింటే షాక్

ఎంఐఎం, బీజేపీ.. ఈ రెండు పార్టీలు బద్ద శత్రువులు. ఒక్క సిద్ధాంతపరంగానే కాదు.. ఏ విధంగా చూసినా.. ఇరు పార్టీల నేతలు చేసుకునే విమర్శలు.. తారా స్థాయిలో ఉంటాయి. ఒకటి జాతీయ పార్టీ అయితే.. మరోటి జాతీయ పార్టీగా గుర్తింపుకోసం.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోటీకి తహతహలాడుతోంది. అయితే ఎంఐఎం ముస్లింల సంక్షేమం కోసం అంటూ చెబితే.. బీజేపీ చెప్పకనే చెప్తూ హిందుత్వ ఏజెండాతో వెళ్లే పార్టీ. అధికారికంగా రెండు పార్టీలు లౌకిక పార్టీలు అని ప్రకటించినా.. […]

బీజేపీని పరోక్షంగా గెలిపిస్తున్న ఎంఐఎం..! అసలు కథ వింటే షాక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 12:50 PM

Share

ఎంఐఎం, బీజేపీ.. ఈ రెండు పార్టీలు బద్ద శత్రువులు. ఒక్క సిద్ధాంతపరంగానే కాదు.. ఏ విధంగా చూసినా.. ఇరు పార్టీల నేతలు చేసుకునే విమర్శలు.. తారా స్థాయిలో ఉంటాయి. ఒకటి జాతీయ పార్టీ అయితే.. మరోటి జాతీయ పార్టీగా గుర్తింపుకోసం.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోటీకి తహతహలాడుతోంది. అయితే ఎంఐఎం ముస్లింల సంక్షేమం కోసం అంటూ చెబితే.. బీజేపీ చెప్పకనే చెప్తూ హిందుత్వ ఏజెండాతో వెళ్లే పార్టీ. అధికారికంగా రెండు పార్టీలు లౌకిక పార్టీలు అని ప్రకటించినా.. రెండు పార్టీలు మాత్రం మతం ప్రతిపదికన ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయన్నది బహిరంగ సత్యం. అయితే ఈ మధ్య ఇరు పార్టీలపై కొందరు కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు వింటే ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి.

తాజాగా ఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. అయితే ఎంఐఎం ప్రవర్తిస్తున్న తీరుపై కొందరు కాంగ్రెస్ శ్రేణులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎంఐఎం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై కాకుండా.. కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్‌ ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయన్న ఆయన.. అందుకే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతుందన్నారు. అయితే ఈ క్రమంలో బీజేపీపై కూడా విమర్శలు చేసినా.. అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ కేవలం టార్గెట్ కాంగ్రెస్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఓవైసీ గతంలో కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకున్నా.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్తూ.. ఒంటరిగా పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే మొన్నటి వరకు తెలంగాణలోనే ఉన్న పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రాలో పోటీచేసి బోణికొట్టారు. ఆ తర్వాత యూపీలో కూడా పోటీకి దిగారు. అయితే తాజాగా.. వెస్ట్ బెంగాల్‌లో కూడా ఎంఐఎం పోటీకి దిగబోతున్నట్లు ఓవైసీ తెలిపారు. అయితే ఎంఐఎం తీరుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎంఐఎం అధికార బీజేపీకి బీ-టీంగా పనిచేస్తోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేంటంటే.. బీజేపీని ఓడించేందుకు మాతో చేతులు కలపకుండా.. ఒంటరిగా పోటీ చేస్తూ మైనార్టీ ఓట్లను కొల్లగొడుతూ.. బీజేపీకి గెలుపు బాటలు వేస్తున్నారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే గుజరాత్‌లో కూడా ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నా.. అక్కడ పోటీ చేయకుండా.. యూపీ, మహారాష్ట్రల్లో పోటీ చేస్తూ.. మైనార్టీ ఓట్లను కాంగ్రెస్‌కు దూరం చేస్తుండటం గమనిస్తే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి