వారిపై ఏపీ ఎస్‌ఈసీ ప్రశంసలు.. చివరి విడత ఎన్నికల్లోను పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిమ్మగడ్డ‌ విజ్ఞప్తి

ఏపీలో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొదటి, రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి...

వారిపై ఏపీ ఎస్‌ఈసీ ప్రశంసలు.. చివరి విడత ఎన్నికల్లోను పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిమ్మగడ్డ‌ విజ్ఞప్తి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 18, 2021 | 2:52 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొదటి, రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు చైతన్యంతో ముందుకు రావటం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు నిలబెట్టారని కితాబునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు నిలబెట్టారని ప్రశంసించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ అంతా సహకరించారని కొనియాడారు.

ఏజెన్సీలో సుమారు 350 పోలింగ్‌ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును సైతం తిరస్కరించి.. గిరిజన ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కితాబిచ్చారు.తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలు దైవ కృపావతి అస్వస్థతకు లోనై .. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కృపావతి కుటుంబ సభ్యులకు ఎన్నికల కమిషన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందన్నారు.

విజయనగరం జిల్లా చౌడువాడలో జరిగిన హింసాత్మక ఘటనను అక్కడ విధి నిర్వహణలోని కానిస్టేబుల్‌ కిషోర్‌కుమార్‌ సమర్దంగా నియంత్రించారని.. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు. చివరి విడత ఎన్నికల్లోను పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Read more:

ఏపీ మంత్రికి హైకోర్టులో స్వల్ప ఊరట.. వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న ధర్మాసనం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!