కుప్పంలో చంద్రబాబు క్లీన్‌ బౌల్డ్‌, రాజకీయాల నుంచి తప్పుకొని ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి : పెద్దిరెడ్డి

కుప్పంలోనే చంద్రబాబు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి. ఇక, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని... లేదంటే ఎమ్మెల్యేగా..

కుప్పంలో చంద్రబాబు క్లీన్‌ బౌల్డ్‌, రాజకీయాల నుంచి తప్పుకొని ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి : పెద్దిరెడ్డి
Peddireddy Ramachandra Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 18, 2021 | 2:42 PM

కుప్పంలోనే చంద్రబాబు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి. ఇక, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని… లేదంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఓటమిని అంగీకరిస్తారో లేదో చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు పెద్దిరెడ్డి. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ బలపర్చిన వాళ్లే గెలిచారని, అందుకు కారణం కుప్పంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని స్పష్టం చేశారు.

మూడో విడత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,574 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే, టీడీపీ కేవలం 13 శాతం విజయాలకే పరిమితమైందని పెద్దిరెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు 36 శాతం గెలిచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 79 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులే నెగ్గారని వెల్లడించారు. ఏకగ్రీవాల్లోనూ తమదే హవా అని, టీడీపీకి 15.8 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, తమకు 85.81 శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి.

Read also : న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!