AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!

గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణమే లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గుడి నిర్మాణం కోసం

న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!
Venkata Narayana
|

Updated on: Feb 18, 2021 | 1:05 PM

Share

గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణమే లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గుడి నిర్మాణం కోసం కుంట శ్రీను పెద్ద ఎత్తు అక్రమాలకు పాల్పడుతున్నారని తరచూ న్యాయవాది గట్టు వామన్‌రావు ఆరోపణలు చేసేవారు. వాట్సాప్‌గ్రూపుల్లో దీనిపై చర్చకు కారణమయ్యేలా పోస్టులు పెట్టేవారు. చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని… గుడిని ఓ ప్రైవేటు కంపెనీ నిర్మిస్తోందని ఆరోపణలు చేసేవారు.

తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని మన మంథని నియోజకవర్గం గ్రూపులో పోస్టులు పెట్టారు. నేరుగా ఎక్కడా కుంట శ్రీను పేరు చెప్పకపోయినా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాల వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ప్లెక్సీ ఫొటోలను కూడా గ్రూపులో పెట్టారు. వివిధ వార్త పత్రిల్లో వచ్చిన న్యూస్‌ను కూడా పోస్టు చేసి విమర్శల వాడిని పెంచారు. గట్టు వామనరావు పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించారు. అనాధికారికంగా రామాలయానికి రంగులు వేస్తుంటే పట్టించుకోరా అంటూ నిలదీశారు. 100కు డయల్ చేసినా మంథనిలో స్పందించే పోలీసులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటివి చాలా అంశాలు ఈ మర్డర్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. కుంట శ్రీను చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో వామన్‌రావు రిట్‌ ఫైల్‌ చేశాడు. మరో రిట్‌ మంథని కోర్టులో ఫైల్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వామన్‌రావు సోషల్‌ మీడియాలో పోస్టులు సైతం చేశారు. గ్రామంలో రామాలయం కమిటీ నియామకం, నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ విషయంలో సైతం వామన్‌రావు తలదూర్చడంతో గ్రామానికి చెందిన రిటైర్డు అధికారితో కూడా విబేధాలున్నాయి. హత్యలో ఆయన ప్రమేయం పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు 900 కోట్లు ఇసుక క్వారీలతో అక్రమంగా సంపాదించాడని హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసి… మధు పోటీ చేయకుండా ప్రయత్నించిన తీరు అప్పట్లో వివాదమైంది. వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి సంఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఇలా పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల విషయాల్లో ఎదురునిలిచారనే ప్రచారం ఉంది.

Read also : ప్రాణాపాయం ఉందని 6 నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు.. చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. చివరికి ఊహించిందే అయింది

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్