ఏపీ మంత్రికి హైకోర్టులో స్వల్ప ఊరట.. వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న ధర్మాసనం

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వర్సోస్‌ రాష్ట్ర న్నికల సంఘంగా సీన్‌ మారిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు..

ఏపీ మంత్రికి హైకోర్టులో స్వల్ప ఊరట.. వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న ధర్మాసనం
ap-high-court
Follow us

|

Updated on: Feb 18, 2021 | 1:03 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వర్సోస్‌ రాష్ట్ర న్నికల సంఘంగా సీన్‌ మారిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడే నిర్వహించొద్దన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ తోసిపుచ్చి, నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో వివాదం నెలకొంది. కోర్టుల్లో పిటిషన్‌ వేసి అధికార పార్టీ ఎన్నికలను అడ్డుకోజూసినా ఫలితం దక్కలేదు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఈఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కు అనుకూలంగానే తీర్పులు వెలువడ్డాయి.

అయితే చంద్రబాబు ఏజెంట్‌లా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక మంత్రులైతే ఓ అడుగు ముందుకేసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లక్ష్యంగా పర్సన్‌ల్‌గా కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వ్యక్తిగత దూషణలకు దిగారనే కారణంగా మంత్రి కొడాలి నానిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆంక్షలు విధించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అంతే కాదు.. మీడియా ఎదుట మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన మంత్రి కొడాలి నానికి కొంతమేర ఊరట లభించింది. మీడియాతో మాట్లాడకూడదంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పును వెలువరించింది.

ప్రభుత్వ పథకాల గురించి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని ధర్మాసనం తెలిపింది. అయితే, ఎస్ఈసీ గురించి కానీ, ఎన్నికల కమిషనర్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు పేర్కొంది.

Read more:

న్యాయవాదుల హత్య కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసిన పోలీసులు