న్యాయవాదుల హత్య కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసిన పోలీసులు
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదుల జంట హత్యల కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లాయర్ దంపతుల హత్యపై భగ్గుమంటున్నారు..
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదుల జంట హత్యల కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లాయర్ దంపతుల హత్యపై భగ్గుమంటున్నారు న్యాయవాదులు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించి..నిరసనలకు దిగారు. మరోవైపు ఈ కేసును..సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు సుప్రీంకోర్ట్ లాయర్ శ్రవంత్ కుమార్.
అడ్వొకేట్ దంపతుల హత్య కేసును సుమోటోగా స్వీకరించింది హైకోర్టు. వామన్‌రావు దంపతుల హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేయాలన్న కోర్టు..న్యాయవాదుల హత్యకేసు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.
మరోవైపు న్యాయవాదుల నినాదాలతో రాష్ట్రంలోని న్యాయస్థానాలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి హత్యలు పునరావృతం కాకూడదంటూ నినాదాలు చేస్తున్నారు న్యాయవాదులు. లాయర్లకు రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు. వామన్‌రావు తండ్రి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు రామగిరి పోలీసులు. ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా కుమార్‌ను చేర్చారు. వారిపై 120బీ, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక విపక్షాల పిలుపుతో మంథనిలో బంద్ కొనసాగుతోంది. వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా బంద్ పాటిస్తున్నారు. బంద్‌కు ప్రజాసంఘాలు, కుల సంఘాలు మద్దతు తెలిపాయి
Read more: