విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన అడ్వకేట్లు.. వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల ముందు న్యాయవాదులు ఆందోళనకు..
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల ముందు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నిందింతులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తూ మల్కాజిగిరి కోర్టులో వద్దా ధర్నా నిర్వహించారు న్యాయవాదులు.
కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని ప్రభుత్వం వెంటనే రిస్క్ ఉన్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సి.బి.ఐ కి అప్పగించి వామనరావు దంపతుల హత్యపై నిస్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
అటు నాంపల్లి క్రిమినల్ కోర్టు ముందు ఆందోళనకు దిగారు న్యాయవాదులు. పోలీసుల అడ్డును తొలగించుకొని గెట్లు తోసుకుని చలో రాజ్ భవన్ కు భారీ ఎత్తున బయలు దేరారు. నాంపల్లి కోర్టు నుంచి చలో రాజ్ భవన్ గా వెళ్లిన న్యాయవాదులను లక్డీకాపూల్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో పట్టపగలే నడిరోడ్డుపై న్యాయవాదులను దుండగులు నరికి చంపడం దారుణమని…ఈ హత్యలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read more:
గవర్నర్ తమిళిసైకి అందిన నియామక పత్రాలు.. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు