- Telugu News పొలిటికల్ ఫొటోలు TRS Leader Errabelli Dayakar Rao and Vinod Kumar Demand For Central Govt To Increase Assembly Seats In Telangana and AP
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినా.. పెంచకపోయినా బీజేపీ గెలిచేది లేదన్న విపక్షత.. మోడీపై ఎర్రబెల్లి ఫైర్.. చిత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు సరే మా సంగతి ఏంటని.. ఏపీ, తెలంగాణ ప్రశ్నిస్తున్నాయి.
Updated on: Aug 04, 2021 | 2:16 PM

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు సరే మా సంగతి ఏంటని.. ఏపీ, తెలంగాణ ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ నేతలు.. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీనా అని ప్రశ్నించిన టీఆర్ఎస్ నేతలు.. సౌత్ ఇండియా పై పూర్తి వివక్ష చూపుతుందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినా, పెంచకపోయినా బీజేపీ గెలిచేది లేదని కేంద్రం వివక్ష చూపుతుందన్నారు.

ఒకే దేశం - ఒకే న్యాయం అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కాశ్మీర్‌కు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలకు మరో న్యాయం ఏంటని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం.. మూర్ఖంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచుతున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ- ఆంద్రప్రదేశ్ లో ఎందుకు సీట్లు పెంచారో సమాధానం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు.

చిన్న సవరణ చేస్తే చాలు.. పని అయిపోతుందని, గతంలోనే ఈ మార్పు చేయాలని తాను సూచించిన.. పట్టించుకోలేదంటున్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.
