- Telugu News పొలిటికల్ ఫొటోలు Andhra pradesh cm ys jagan mohan reddy participated vana mahotsavam 2021in guntur district
AP CM YS Jagan: ఏపీలో జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం.. మొక్క నాటి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చిత్రాలు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. రాగి, వేప మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ఓ యజ్ఞంలా చేపట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Updated on: Aug 05, 2021 | 1:31 PM

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. రాగి, వేప మొక్కలు నాటారు.

మొక్కలు నాటడం ఓ యజ్ఞంలా చేపట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని సీఎం జగన్ పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అందరితో ప్రమాణం చేయించారు.

అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు.

అంతకు ముందు ఎయిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏపీ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.

CM YS Jagan

జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
