Food for Asthma: శీతాకాలంలో ఆస్తమా పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి!
ఆస్తమా పేషెంట్లు శీతా కాంలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెంచడంలో హెల్ప్ అవుతుంది. అదే విధంగా వాల్ నట్స్ లో ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్తమాను దూరం చేస్తాయి. గ్రీన్ టీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆస్తమా సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పసుపు కూడా ఉబ్బసం వంటి సమస్యల నుంచి రిలీఫ్..
Chinni Enni | Edited By: TV9 Telugu
Updated on: Dec 27, 2023 | 5:50 PM

శీతా కాలంలో ఆస్తమాతో బాధ పడుతున్న వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో ఆస్తమా పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆస్తమా పేషెంట్లు శీతా కాంలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెంచడంలో హెల్ప్ అవుతుంది. అదే విధంగా వాల్ నట్స్ లో ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్తమాను దూరం చేస్తాయి.

గ్రీన్ టీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆస్తమా సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పసుపు కూడా ఉబ్బసం వంటి సమస్యల నుంచి రిలీఫ్ నెస్ కలిగిస్తుంది. కాబట్టి పసుపును క్రమం తప్పకుండా కూరల్లో వేసుకుంటే సరిపోతుంది.

అలాగే ఆకు కూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. మునగాకు, బచ్చలి కూర, తోట కూడార వంటివి రెగ్యులర్ గా తీసుకుంటే ఆస్తమా పేషెంట్లకు హెల్ప్ అవుతుంది. ఆకు కూరల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఆస్తమా ఉన్న వారికి అల్లం ఎంతో ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది. అల్లంను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ తాగినా.. అల్లంతో తయారు చేసుకునే ఆహారం తినడం వల్ల కూడా ఉబ్బసం అనేది కంట్రోల్ అవుతుంది.





























