- Telugu News Photo Gallery Cinema photos Will the trend of using obscene words in trailers for promotion not ever stop?
Vulgar Trailers: ప్రమోషన్స్ కోసం ట్రైలర్‌లో బూతులు.. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగదా.?
సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త దారులు వెతుకుతున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు హద్దు దాటుతున్నారు కూడా. రీసెంట్ టైమ్స్‌లో సినిమా ప్రమోషన్‌లో బూతుల వాడకం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్స్‌లో ఇలాంటి పదాలు రెగ్యులర్‌గా వినిపిస్తున్నాయి. నిజంగా బూతులు సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తాయా?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 07, 2025 | 2:11 PM

రీసెంట్‌గా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్‌లో బూతులను గట్టిగా వాడారు. నిజానికి ట్రైలర్‌లో వినిపించిన ఆ డైలాగులు సినిమాలో ఉండే ఛాన్సే లేదు. సెన్సార్ సమయంలో ఆ డైలాగ్స్ మ్యూట్ చేయటం లేదా కట్ చేయటం పక్కాగా జరుగుతుంది.

సెన్సార్ అలాంటీ డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తుందని విషయం చిత్ర యూనిట్‌కి కూడా తెలుసు, అయినా వారికి సినిమాకు హైప్ తీసుకురావటం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.

ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. అర్జున్ రెడ్డి సినిమా టైమ్‌లోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవటం మొదలైంది. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. ఒక రకంగా ఆ రచ్చే సినిమాకు బజ్ తీసుకురావటంలో హెల్ప్ అయ్యింది.

అందుకే ఆ తరువాత చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేశారు. విశ్వక్‌సేన్ తన ప్రతీ సినిమా ట్రైలర్‌లో ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఫలక్‌నమాదాస్, దమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల ట్రైలర్స్‌లో బూతులు వినిపించాయి.

రీసెంట్‌గా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ ది పారడైస్ సినిమా ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లోనూ ఇలాంటి ఓ పదం వినిపించటంతో ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదంటున్నారు క్రిటిక్స్.





























