- Telugu News Photo Gallery Cinema photos Actress Vaishnavi Chaitanya Confusion at Bhimavaram Event In Siddu Jonnalagadda Jack movie Promotions
Vaishnavi Chaitanya: అంత మాట అనేసావేంటమ్మాయ్.. మైక్ ఉందని చూసుకోబడ్లా.. వైష్ణవి చైతన్య కన్ఫ్యూజన్..
ప్రస్తుతం జాక్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. కొన్ని రోజులుగా హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొంటుంది. తాజాగా భీమవరంలో జరిగన ఈవెంట్లో పాల్గొన్న ఈ బ్యూటీ ఆ ఊరు పేరునే మర్చిపోయింది. దీంతో ఆమెకు హీరో సిద్ధు జొన్నలగడ్డ సాయం చేశారు.
Updated on: Apr 07, 2025 | 1:19 PM

బేబీ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ చిత్రంలో నటిస్తుంది ఈ వయ్యారి. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలకానుంది.

ఈ క్రమంలోనే జాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సిద్ధు, వైష్ణవి ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల భీమవరంలోని విష్ణు కాలేజీలో నిర్వహించిన ఈవెంట్లో జాక్ చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో అక్కడి విద్యార్థులతో సిద్దు, వైష్ణవి ఇంట్రాక్ట్ అయ్యారు.

అక్కడి స్టూడెంట్స్ చేసిన అల్లరి, డ్యాన్సులు చూసి మురిసిపోయారు. ఈ క్రమంలోనే స్టేజ్ మీద వైష్ణవి మాట్లాడుతూ స్టూడెంట్ లైఫ్, కాలేజీ జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదే సమయంలో భీమవరంలో అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది.

ఇది భీమవరం .. రాజమండ్రి కాదు అని అంటూ అనేశారు. అప్పుడే సిద్ధు వచ్చేసి చెవిలో భీమవరం అని చెప్పడంతో వెంటనే మైక్ లో ఎఫ్ పదం అనేసింది. ఇంతకు ముందు రాజమండ్రి వెళ్లి ఇక్కడకు వచ్చాం కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యాను అంటూ కవర్ చేసేసింది.

Vaishnavi Stunning




