Shankar: నెక్ట్స్ మూవీ కోసం కాంప్రమైజ్ అవుతారా.? శంకర్ ఏం చేయబోతున్నారు.?
టైమ్ మనదైనపుడు ఏం చేసినా నడుస్తుంది.. కానీ అదే టైమ్ ఒక్కసారి రివర్స్ అయితే అప్పుడు మనమేంటనేది తెలుస్తుంది. దర్శకుడు శంకర్ ఉన్న సిచ్యువేషన్ ఇదే. నెక్ట్స్ సినిమా కోసం ఈయన కాంప్రమైజ్ అవుతారా..? లేదంటే నిర్మాతలకు వందల కోట్లు కావాలని డిమాండ్ చేస్తారా..? శంకర్ అసలేం చేయబోతున్నారు..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 07, 2025 | 1:00 PM

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. కొన్నిసార్లు అది మన మాట వింటుంది.. అప్పుడేం చేసినా చెల్లుతుంది. టైమ్ బాలేనపుడు అది చెప్పినట్లు మనం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ శంకర్ మొదటిది చేసారు. ఇక ఇప్పుడు రెండోది చేయాల్సి వచ్చేలా ఉంది.

ఈ మధ్య ఈయనకు టైమ్ పెద్దగా కలిసిరావట్లేదనేది కాదనలేని చేదు నిజం. సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. బడ్జెట్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్.

డబ్బు నీళ్లలా ఖర్చు చేసారు.. షూట్ చేసింది సినిమాలో చూపించలేదనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ ఛేంజర్ ఫుటేజ్ 5 గంటలు అంటూ ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేసాయి.

ఓ ప్లానింగ్ అంటూ లేకుండా 5 గంటల ఫుటేజ్ తీస్తే.. నిర్మాతకు ఎంత నష్టం అనేది ఐడియా లేదా అంటూ శంకర్‌పై సెటైర్లు పేలుతున్నాయిప్పుడు. ఈ సమయంలో ఈయన నెక్ట్స్ సినిమాల విషయంలో ఆసక్తి మొదలైంది. ఇన్ని రోజులంటే శంకర్ చెప్పినంత బడ్జెట్ ఇచ్చారు నిర్మాతలు.. ఇకపై కూడా ఈయనపై నమ్మకంతో అంతే ఇస్తారా అనేది ఆసక్తికరమే.

గత పదేళ్లలో శంకర్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఇండియన్ 3 కూడా వచ్చేవరకు అనుమానమే. ఇలాంటి టైమ్‌లో వీరయుగ నాయగన్ వేల్పరి ప్రాజెక్ట్ ప్రకటించారు శంకర్. ఆయన ఊహకు తగ్గట్లు వేల్పరి తీయాలంటే 1000 కోట్లు కావాలి. మరి అంత బడ్జెట్.. ఇప్పుడు శంకర్‌ను నమ్మి పెడతారా..? చూడాలిక.. ఏం జరగబోతుందో..?





























