- Telugu News Photo Gallery Cinema photos Tollywood Young Directors Introducing their hidden talent to the audience
Directors: దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్..
మన దర్శకులు మల్టీ టాలెంటెడ్ అబ్బా..! మెగాఫోన్ పట్టుకుని కెమెరా వెనక కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు.. ఇంకా చాలా చేస్తున్నారు. ముఖ్యంగా తమలోని టాలెంట్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. వాళ్లని చూస్తే దర్శకులు అనాలో.. యాక్టర్స్ అనాలో అర్థం కావట్లేదు. ఒక్కరో ఇద్దరో కాదు చాలా మంది దర్శకులు మన దగ్గర అలాగే ఉన్నారు.
Updated on: Apr 07, 2025 | 12:25 PM

ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరో యాక్టర్ కాదు.. డైరెక్టర్ ఆఫ్ మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్. చాలా కామ్‌గా కనిపించే ఈయనలో ఇంత మాస్ యాంగిల్ ఉందని ఎవరైనా ఊహించారా..? నిన్న మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌లో కళ్యాణ్ శంకర్ డాన్స్ వైరల్ అవుతుంది బాగా..! ఈయనొక్కడే కాదు.. అనిల్ రావిపూడి కూడా మల్టీటాలెంటెడే.

అనిల్ రావిపూడిని చూస్తే ఏ కోశానా దర్శకుడిలా కనిపించడు.. ఆయనలో అద్భుతమైన నటుడే కాదు డాన్సర్ కూడా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడూ బయటికొస్తుంటాడు. చాలామంది ఫ్యాన్స్ ఆయన్ని హీరో మెటీరియల్ అని కూడా అంటుంటారు.

సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషనల్ వీడియోలలో అనిల్ కామెడీ టైమింగ్ అందరికీ తెలిసింది. తాజాగా చిరంజీవి కోసం ఇదే మొదలుపెట్టారు. అనిల్ రావిపూడి అడీషనల్ టాలెంట్ ఆయన సినిమాలకు బాగా హెల్ప్ అవుతుంది.

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీకి దర్శకుడిగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆయన కామెడీ టైమింగ్‌కే అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు బయట కనిపిస్తే కడుపులు చెక్కలే. కొన్ని టెలివిషన్ షోలకి ఈయన ఉన్న ఎపిసోడ్స్ మరి టీఆర్పి వచ్చింది.

అలాగే తరుణ్ భాస్కర్ కూడా డైరెక్షన్‌తోనే కాదు.. నటుడిగా మెప్పిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇది అయన సినిమాలు ప్లస్ అవుతుంది. అందుకే చెప్పేది మన కుర్ర దర్శకులంతా మల్టీ టాలెంటెడ్ అని..!




