- Telugu News Photo Gallery Cinema photos Actress Aditi Rao Hydari Says About Why She Married Hero Siddharth
Adithi Rao Hydari: అందుకే సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకున్నా.. అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..
సౌత్ టూ నార్త్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన హీరోయిన్లలో అదితి రావు హైదరీ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినీరంగంలో యాక్టివ్ గా ఉంటుంది అదితి. తాజాగా తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.
Updated on: Apr 07, 2025 | 11:36 AM

అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రోటిన్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇటీవలే టాలీవుడ్ సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. మహా సముద్రం సినిమాలో సిద్దార్థ్, అదితి రావు హైదరీ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

2006లో ప్రజాపతి సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది అదితి. ఇందులో మమ్ముట్టి సరసన నటించింది. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. హిందీలో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మావాత్ వంటి చిత్రాల్లో నటించింది.

ఇక తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించింది. టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా హిట్స్ పడలేదు. అదితి భరతనాట్య కళాకారిణి. హీరామండి సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

హీరామండి తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదని.. సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 1978 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది అదితి.




