- Telugu News Photo Gallery Cinema photos NTR came forward to his fans after years and gave clarity on his lineup
NTR: చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. లైనప్‌పై క్లారిటీ..
చాలా రోజులైపోయింది ఎన్టీఆర్ అభిమానుల ముందుకొచ్చి..! పైగా దేవరకు కూడా ఎలాంటి సక్సెస్ మీట్ చేయలేదు మేకర్స్. దాంతో భారీగా బాకీ పడిపోయారు ఫ్యాన్స్‌కు తారక్. అందుకే చాన్నాళ్ళ తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఎన్నో విషయాలు చెప్పారు. అంతేకాదు తన లైనప్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు.
Updated on: Apr 07, 2025 | 11:50 AM

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు జపాన్ వెళ్లి దేవరను ప్రమోట్ చేసిన తారక్.. అక్కడ్నుంచి రాగానే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ముందుకొచ్చిన తారక్.. చాలా విషయాలు పంచుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కాస్తా.. దేవర సక్సెస్ మీట్‌లా మారిపోయింది.

ఫ్యాన్స్‌ను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యారు తారక్. చాలా రోజుల తర్వాత కలిసినందుకో ఏమో గానీ అడక్కపోయినా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఓ వైపు మ్యాడ్ స్క్వేర్ గురించి మొత్తం మాట్లాడాక.. తీరిగ్గా తన నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు.

దేవర 2 లేదని అంటున్నారని.. అలాంటిదేం లేదని కచ్చితంగా దేవర 2 ఊహించిన దానికంటే భారీగా ఉంటుందని చెప్పారు తారక్. వింటున్నారుగా.. మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి కాస్త పాజ్ ఇచ్చామంటున్నారు తారక్.

కచ్చితంగా దేవర 2 నెక్ట్స్ లెవల్ అంటున్నారు తారక్. అంతేకాదు.. ఇదే వేడుకలో మరో సినిమా అప్‌డేట్ కూడా ఇచ్చారీయన. చాలా రోజుల తర్వాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు.

నాగవంశీ నిర్మాతగా జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు తారక్. ఈ లెక్కన ప్రస్తుతం వార్ 2.. నెక్ట్స్ డ్రాగన్.. ఆ తర్వాత దేవర 2.. ఆపై నెల్సన్ సినిమా.. ఇలా రాబోయే మూడేళ్ళ వరకు తారక్ డైరీ ఫుల్ అయిపోయిందన్నమాట.




