Social Media: సోషల్ మీడియాలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్.. విసిగిపోయి గుడ్‌బై చెప్పేసిన సెలబ్రిటీలు..

సోషల్ మీడియా సెలబ్రిటీలకు తలనొప్పిగా మరుతోంది. సెలబ్రిటీల ప్రొఫెషనల్ వర్క్స్‌ నుంచి, పర్సనల్ విషయాల వరకు ప్రతీ దాన్నీ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్‌. దీంతో విసిగిపోయిన కొంత మంది సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ మధ్య ఇలా గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య కాస్త గట్టిగా కనిపిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్ డైరెక్టర్‌ వెంకటేష్‌ మహా తన సోషల్ మీడియా పేజ్‌ను డీయాక్టివేట్‌ చేశారు.

Satish Reddy Jadda

| Edited By: Prudvi Battula

Updated on: Dec 27, 2023 | 4:00 PM

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్ డైరెక్టర్‌ వెంకటేష్‌ మహా తన సోషల్ మీడియా పేజ్‌ను డీయాక్టివేట్‌ చేశారు. డంకీ సినిమా రిలీజ్ సందర్భంగా తాను ఫస్ట్ డే ఆ సినిమా చూస్తున్నా అంటూ ఓ పోస్ట్ పెట్టారు వెంకటేష్‌. దీంతో హర్డ్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్ వెంకటేష్‌ను టార్గెట్ చేశారు.

1 / 5
గతంలో కేజీఎఫ్ విషయంలో వెంకటేష్‌ మహా చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు సలార్ విషయంలో అభిమానుల రియాక్షన్ మరింత అగ్రెసివ్‌గా ఉండటంతో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు వెంకటేష్‌ మహా.

2 / 5
కొద్ది రోజుల క్రితం మాటల రచయిత రామ జోగయ్య శాస్త్రీ కూడా సోషల్ మీడియా నుంచి క్విట్ అయ్యారు. గుంటూరు కారం సెకండ్ సింగిల్ విషయంలో నెటిజెన్స్‌తో జరిగిన వాగ్వాదం తరువాత రామజోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఇలా సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్న స్టార్స్‌ సంఖ్య గట్టిగా కనిపిస్తోంది.

3 / 5
ట్రోలర్స్‌ దాడిని తట్టుకోలేక దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలా రోజుల క్రితమే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు. రెండేళ్ల క్రితం స్టార్‌ కిడ్‌ సోనాక్షి సిన్హా కూడా ట్విటర్‌ నుంచి తప్పుకున్నారు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణం తరువాత వచ్చిన నెగెటివిటీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సోనాక్షి.

4 / 5
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ కూడా సోషల్ మీడియాకు సెండాఫ్ ఇచ్చారు. 2021లో తన బర్త్‌ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమిర్‌. పర్సనల్ అప్‌డేట్స్ ఏవి సోషల్ మీడయా వేదికగా షేర్ చేయనని తేల్చి చెప్పిన ఆమిర్‌... తన సినిమాల అప్‌డేట్స్ మాత్రం ఆమిర్ ఖాన్‌ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పేజెస్‌లో వస్తాయని క్లారిటీ ఇచ్చారు.

5 / 5
Follow us