- Telugu News Photo Gallery Cinema photos Pan india star Prabhas and director sandeep reddy vanga movie spirit shooting update Telugu Heroes Photos
Prabhas – Spirit: డార్లింగ్ ఫ్యాన్స్ కి గూజ్‌బంప్స్ న్యూస్.! స్పిరిట్ వర్క్ స్టార్ట్ పై సందీప్ వంగా.
సలార్ సక్సెస్‌తో సూపర్ హ్యాపీగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్. వాయిదా పడుతుందేమో అనుకున్న ఓ సెన్సేషనల్ కాంబో త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఏంటా కాంబో అనుకుంటున్నారా.? సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది. ఈ జోష్‌ను డబుల్ చేసే న్యూస్ ఒకటి నార్త్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా యానిమల్ సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు...
Updated on: Dec 27, 2023 | 4:53 PM

సలార్ సక్సెస్‌తో సూపర్ హ్యాపీగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్. వాయిదా పడుతుందేమో అనుకున్న ఓ సెన్సేషనల్ కాంబో త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఏంటా కాంబో అనుకుంటున్నారా..?

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది.

ఈ జోష్‌ను డబుల్ చేసే న్యూస్ ఒకటి నార్త్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా యానిమల్ సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

అయితే ఈ సినిమా తరువాత సందీప్ చేయబోయే మూవీ విషయంలో కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో సందీప్, యానిమల్ పార్క్ మీద దృష్టి పెట్టారన్న ప్రచారం జరిగింది.

సందీప్ నెక్ట్స్ మూవీ విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్. 2024 మేలో స్పిరిట్ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు.

దీంతో సందీప్ రెడ్డి వంగా చేయబోయే నెక్ట్స్ మూవీ స్పిరిటే అన్న క్లారిటీ వచ్చేసింది. రణబీర్ లాంటి చాక్లెట్ బాయ్‌నే మోస్ట్ వైలెంట్ రోల్‌లో చూపించిన సందీప్‌కి, ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే.

ఈ ఊహకే ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ వస్తున్నాయి. ఇక స్క్రీన్ మీద ఈ కాంబో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో చూసేందుకు ఆడియన్స్ ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.




