- Telugu News Photo Gallery Cinema photos Heroine Trisha Krishnan acted in action scenes in identity movie with tovino Telugu ACtress Photos
Trisha Krishnan: గ్లామర్ యాంగిలే కాదు యాక్షన్ కూడా చూస్తారా అంటున్న చెన్నై బ్యూటీ త్రిష.
సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు. వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న త్రిష గ్లామర్, తాజాగా మాలీవుడ్‌లో యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.
Updated on: Dec 27, 2023 | 5:55 PM

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు.

వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న త్రిష గ్లామర్, తాజాగా మాలీవుడ్‌లో యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

నిన్న మొన్నటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్ అయిన త్రిష.. ఈ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడిగా మారారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో హుందాగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు త్రిష.

తెర మీద గ్రేస్‌ఫుల్‌గా కనిపించటమే కాదు.. సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లోనూ అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షింంచారు. దీంతో మరోసారి త్రిష టాక్ ఆఫ్ ది సౌత్‌గా మారారు.

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ తరువాత విజయ్, లోకేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి.

ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ సినిమాలో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించబోతున్నారు.

తాజాగా సెట్‌లో అడుగుపెట్టిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్న త్రిష, ముందు ముందు మరిన్ని సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండాలంటున్నారు.




