Watch: ఓ మై అక్కో.! నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఈమె స్టంట్ చూస్తే కళ్లు తేలేస్తారు
ముఖ్యంగా వారు చేసే స్టంట్స్ కోసం ఎక్కడైనా ఏదైనా భయం, బెరుకు లేకుండా చేస్తున్నారు. కాకపోతే, చాలా సందర్భాల్లో వారు అనుకున్న దానికంటే.. రివర్స్‌లో జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి రీల్ చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళితే..

నేటి యువతకు వైరల్ అవ్వాలనే పిచ్చి బాగా ఉంది. దాని కోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈ వైరల్ పిచ్చి జనాల్లో ఎలా ఉందంటే.. వారు దాని కోసం తమ ప్రాణాలను కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వారు చేసే స్టంట్స్ కోసం ఎక్కడైనా ఏదైనా భయం, బెరుకు లేకుండా చేస్తున్నారు. కాకపోతే, చాలా సందర్భాల్లో వారు అనుకున్న దానికంటే.. రివర్స్‌లో జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి రీల్ చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళితే..
స్టంట్స్ అంటే పిల్లల ఆట కాదని, దానికి చాలా సాధన అవసరమని అంటారు. అందుకు సరైన ఉదాహరణ ఈ వీడియో..కొంతమంది కేవలం ప్రాక్టీస్ కోసమే స్టంట్స్ చేయడం ప్రారంభించి, చివరికి ఆట ఆడటం మొదలుపెడతారు. ఇప్పుడు ఒక అమ్మాయి మంచం మీద దూకి రీల్ తీస్తున్న ఈ వీడియోను చూడండి.
ఈ వీడియో చూడండి..
तुम क्या समझते हो सिर्फ लड़कों में ही कीड़ा होता है नहीं ऐसा बिल्कुल नहीं है 🤣😊😂🤪#ManojBarathiRaja #मनोज_कुमार #manoj_kumar pic.twitter.com/CYXqdPIXTN
— urooj fatima (@urjfati) April 4, 2025
వైరల్ వీడియోలో ఒక అమ్మాయి ఇంటి ముందు ఉంచిన మంచం మీదకు దూకడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మొదటి రెండు ప్రయత్నాలలో విజయం సాధించింది. ఆపై ఆమె ఆత్మవిశ్వాసం ఎంతగా పెరిగిందంటే ఆమె ప్రయత్నం మరింత తీవ్రం చేసింది..కానీ, మూడవసారి ఆమె నిలబడి ఉన్న మంచం మీద నుండి దూకడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తన పట్టును కోల్పోయింది. మంచం దాటలేక నేరుగా నేలపై పడిపోతుంది. ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @urjfati అనే ఖాతా షేర్ చేసింది. కాగా నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ప్రజలు దీనిని చూశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




