అయితే రాత్రి సమయంలో మాత్రం శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయాల్లో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెరుగులో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు పెరుగుతాయి. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది.