ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. చెప్పుతో చెంప చెళ్లుమనిపించిన ఏఎస్ఐ..!

పంజాబ్ పోలీసుల ఓవరాక్షన్ మరోసారి బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలిపై చెప్పుతో దాడి చేశాడు ఓ పోలీసు అధికారి. అయితే ఫిర్యాదుకు సంబంధించి రెండు పార్టీలను పోలీసు స్టేషన్‌కు పిలిపించామని పోలీసుల చెప్పారు. ఇంతలో మహిళ భర్త పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో తోపులాట చోటుచేసుకుందని, మహిళపై ఎవరు దాడి చేయలేదని వివరణ ఇచ్చారు.

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. చెప్పుతో చెంప చెళ్లుమనిపించిన ఏఎస్ఐ..!
Amritsar Police
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 05, 2025 | 11:50 AM

పంజాబ్ పోలీసుల ఆరాచకం మరోసారి బయటపడింది. తాజాగా అమృత్‌సర్‌లో కేసు వెలుగులోకి వచ్చింది. అమృత్‌సర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై ఏఎస్‌ఐ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్‌లో జరిగిన గొడవ గురించి బాధిత మహిళ సమాచారం ఇస్తూ, తన భర్త ఒకరితో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు తాను పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నానని తెలిపింది. ఈ సమయంలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది.

గొడవ తర్వాత పోలీసులు ఫిర్యాదు రాసి ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళ తెలిపింది. కానీ పోలీసులు తమ మాట వినలేదని,. మమ్మల్ని జైల్లో పెడతామని పదే పదే బెదిరించారని ఆరోపించింది. అయితే ఎవరూ చెప్పుతో కొట్టలేదని పోలీసు అధికారి క్లారిటీ ఇచ్చుకున్నారు. మహిళ భర్త వీరంగం సృష్టించడంతో అతడిని శాంతింపజేసే ప్రయత్నం చేశామన్నారు. ఈ సమయంలో మహిళ భర్త పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ పోలీసులతో గొడవకు కూడా ప్రయత్నించింది.మమ్మల్ని జైల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినప్పుడు ఓ పోలీసు నా ముఖంపై బలంగా కొట్టాడని ఆ మహిళ చెప్పింది. పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీసు లేరని మహిళ చెప్పింది. పోలీసులు కావాలనే తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పుడు తనపై చెప్పుతో కొట్టారన్నారు. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది.

ఈ విషయంపై పోలీసు అధికారి మాట్లాడుతూ, ఫిర్యాదుకు సంబంధించి రెండు పార్టీలను పోలీసు స్టేషన్‌కు పిలిపించారని చెప్పారు. ఇంతలో మహిళ భర్త పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో పోలీసులు దాడికి ప్రయత్నించారు. ఆమెను ఆపారు కానీ ఆమె ముందుకు వచ్చి చెప్పుతో కొట్టారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ చెప్పుతో కొట్టలేదని, ఆ తర్వాత మహిళ కూడా పోలీసులపై చేయిచేసుకుందని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..