ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు.కానీ మారుతున్న జీవన శైలి వలన ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.
సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్,అతిగా తినడం వలన ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ సమస్య అధికం అవుతోంది.
చాలా మందికి తిన్నది అరగకపోవడం, తేన్పులు రావడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్య మొదలు అవుతుంది
ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయట పడటానికి చాలా మంది మెడిసన్ వాడటం, ఆరోగ్య చిట్కాలు పాటించడం చేస్తుంటారు.
అయితే ఈ చిన్న చిట్కాతో గ్యాస్, ఎసిడిటీ సమస్య నుంచి ఈజీగా బయట పడవచ్చునంట. ఇంతకీ ఆ ఆరోగ్య చిట్కా ఏమిటంటే?
అల్లం, సోంపుతో తయారు చేసిన టీ తాగడం వలన గ్యాస్, ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చునంటున్నారు ఆరోగ్య నిపుణులు
ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్. యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయంట.అంతే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహదం చేస్తుంది
ఉదయాన్నే గ్లాస్ నీటిలో సోంపు, అల్లం వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో సోంపు, అల్లం టీ రెడీ, దీనిని ప్రతి రోజూ తాగడం వలన గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.