Rythu Bharosa Scheme: వారందరికీ నో రైతు భరోసా.. పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..? ఎవరు అర్హులంటే..

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆంక్షల్లేవు, సీలింగ్ లేదు. సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఈనెల 26 నుంచి రైతుభరోసా అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకింద 12వేలు ఇస్తామని ప్రకటించింది.

Rythu Bharosa Scheme: వారందరికీ నో రైతు భరోసా.. పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..? ఎవరు అర్హులంటే..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 05, 2025 | 8:38 AM

రైతు భరోసాపై ఊహాగానాలకు తెరదించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు ఎంతభూమిని సాగుచేసుకుంటే అంతభూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. సాగుభూములకు సీలింగ్ లేదని ప్రకటించారు. ప్రతి ఏడాది 12 వేలు రైతు భరోసా ఇస్తామని సీఎం తెలిపారు.. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు 10వేల రూపాయలిస్తే తాము 12 వేల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ 12 వేలను రెండు విడతల్లో ఆరువేల చొప్పున రైతులకు అందించనున్నారు.

అయితే.. వ్యవసాయ యోగ్యం కాని భూములు.. రాళ్లురప్పలు ఉన్న భూములు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, పడావుపడ్డ భూములు, మైనింగ్‌ కోసం ఇచ్చిన ల్యాండ్‌కు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.. అలాగే.. నాలా కన్వర్టెడ్‌ భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సర్కార్ స్పష్టంచేసింది.

రైతుభరోసా ఏ భూములకు రాదో వివరించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారని.. దీని గురించి ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి తెలిపారు. దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినందున మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు రైతు భరోసా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుభరోసా ఈనెల నుంచే అమలు కానుంది. ఈనెల 26 నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..