AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tour: సమ్మర్ టూర్ ఉందా.? చెన్నై సమీపంలో ఈ ప్రదేశాలు బెస్ట్..

చెన్నై అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలలో ఒకటిగా ఉంది. దాని చారిత్రక నేపథ్యం, సముద్రతీరం, సంప్రదాయాలకు ఖ్యాతి గాంచింది.  కఠినమైన వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం చెన్నై చుట్టుప్పక్కల సుందరమైన గమ్యస్థానాల ఉన్నాయి. వారాంతపు విహారాలు, వేసవి బస చేయాలనుకునే సందర్శకులకు స్వగతం అంటున్నాయి ఈ ప్రదేశాలు. మరి టూరిస్ట్ స్పాట్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Apr 06, 2025 | 10:15 AM

Share
చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలగిరి కొండలు తమిళనాడులోని ప్రత్యేక స్థానాన్ని అందుకున్నాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1,410 మీటర్ల ఎత్తులో ఉంది. ఏ సీజన్ అయినా ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులను అందిస్తుంది. ఈ ప్రాంతం స్వామిమలై, పుంగనూర్ సరస్సు వంటి విశ్రాంతి ప్రదేశాలతో పాటు పారాగ్లైడింగ్,  హైకింగ్, ఫ్లైయింగ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. వేసవి టూర్ కోసం ఇది మంచి ఎంపిక.

1 / 6
నీలగిరి కొండల శ్రేణిలో ఉన్న కోటగిరి ఊటీకి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది చెన్నై నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1800 మీటర్ల ఎత్తు నుంచి విస్తృతమైన టీ తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, కేథరీన్, ఎల్క్ అనే రెండు జలపాతలు కలిసే అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. కోటగిరి సాధారణ రద్దీగా ఉండే హిల్ స్టేషన్. ప్రజలకు దీని గురించి పూర్తిగా తెలీదు. సమ్మర్ వేళా రిఫ్రెష్ కోసం ఇది బెస్ట్. సందర్శకులు రంగస్వామి శిఖరాన్ని ఎక్కడం, సాంప్రదాయ చేనేత వస్తువుల మార్కెట్లలో షాపింగ్ చేయడం చేయవచ్చు.

2 / 6
పశ్చిమ కనుమల్లో విలసిల్లుతున్న కూనూర్‌ చెన్నైకి ఉత్తరాన 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి జిల్లాలోని ఒక అద్భుతమైన పట్టణం. ఈ హిల్ స్టేషన్‌లోని విస్తారమైన టీ తోటలు, పచ్చని వృక్షసంపద మధ్య విశ్రాంతి తీసుకోవాలనుకునే సందర్శకులను ఆకర్షిస్తాయి. 1000 కంటే ఎక్కువ మొక్కల జాతులతో కూడిన సిమ్స్ పార్క్, యునెస్కో జాబితాలో చేరిన నీలగిరి పర్వత రైల్వే సందర్శకులను ఆకర్షిస్తాయి. డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్, లాంబ్స్ రాక్ లోయ విశాల దృశ్యాలను ఆకట్టుకుంటాయి. వేడి వేసవి నెలల నుంచి ఉపశమనం పొందేందుకు కూనూర్ అనువైన ప్రదేశం.

3 / 6
చెన్నై నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీని "క్వీన్ అఫ్ హిల్ స్టేషన్స్" అనవచ్చి. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం వేసవికాలంలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఊటీ సరస్సు బోటింగ్, గులాబీ తోటలతో పాటు పట్టణంలో ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఉన్నాయి. సందర్శించే పర్యాటకులు నీలగిరిలో ఎత్తైన దొడ్డబెట్ట శిఖరాన్ని చేరుకోవచ్చు. బ్రిటిష్ కాలం నాటి విస్తారమైన గడ్డి భూములను కలిగి ఉన్న వెన్లాక్ డౌన్స్‌ను చూడవచ్చు.

4 / 6
"ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్"గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ చెన్నై నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రోడ్డు ద్వారా త్వరగా  చేరుకోగల ప్రదేశం. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంది. మెరిసే సరస్సులు, గంభీరమైన జలపాతాలు దాని చుట్టూ ఉన్నాయి. బ్రయంట్ పార్క్ సందర్శనతో పాటు కోకర్స్ వాక్, బెరిజామ్ సరస్సు చూడవచ్చు. లో జిప్‌లైనింగ్, గుర్రపు స్వారీ వంటి అడ్వెంచరర్స్ రైడ్స్చేయవచ్చు. అయితే కొడైకెనాల్ సరస్సుపై పడవ ప్రయాణం ఆకర్షిస్తుంది. ఉదయం పొగమంచు, రాత్రి నక్షత్రాల కాంతితో విలసిల్లే ఈ ప్రాంతం వేసవి విడిదికి మంచి ఎంపిక.

5 / 6
చెన్నై సమీపంలో తక్కువ రద్దీ ఉన్న జవాదు కొండలు వేసవి సెలవులకు మంచి ఎంపిక. ఇది వెల్లూరు జిల్లాలో ఉంది.  అమృతి జూలాజికల్ పార్క్, జింగీ కోట ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలు. ఈ ప్రాంతంలో అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రయాణికులను ఈ ప్రదేశం ఎంతగానో అకసిస్తుంది.

6 / 6