అలెర్జీ నుంచి బయటపడటానికి బెస్ట్ టిప్స్!
చాలా మంది అలెర్జీ సమస్యతో బాధపడుతుంటారు. చిన్న పాటి దుమ్ము , లేదా ఇంటిలో ఏవైనా పనులు చేసినా తుమ్ములు, కళ్లలో దురద, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 22, 2025 | 6:30 PM

తేనె : చాలా మంది ఇంటిలో తేనె ఉంటుంది. అయితే ఇది అలెర్జీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సహజ తేనె తీసుకొని దానిని ప్రతి రోజూ ఉదయం ఒక చెంచా తీసుకోవడం వలన ఇది ప్రతీ సీజన్‌లో వచ్చే అలెర్జీల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట.

ఆవిరి పీల్చడం : అలెర్జీ వలన చాలా మంది ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే దానిని నుంచి సులభంగా బయటపడటానికి ఆవిరి పీల్చడం సులభమైన మార్గం.కొన్ని చుక్కల యూకలిస్టస్‌ను జోడించి ఆవిరి పట్టడం వలన త్వరగా ముక్కుదిబ్బడ వంటి సమస్యల నుంచి బయటపడతారంట.

అలెర్జీలతో బాధపడే వారు క్వెర్సెటిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలంట. ఇది ఎక్కువగా ఆపిల్స్, ఉ్లలిపాయలు, బెర్రీస్ వంటి ఆహారాల్లో కనిపిస్తాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.

గ్రీన్ టీ లేదా అల్లం టీ, హెర్బల్ టీ వంటివి తాగడం వలన కూడా అలెర్జీ సమస్య నుంచి బయటపడేలా చేస్తుందంట. ముఖ్యంగా అల్లం టీ రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అలెర్జీతో బాధపడే వారు ప్రతి రోజూ అల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

సెలైన్ రిన్స్: ముక్కు రంధ్రాల నుండి అలెర్జీ కారకాలను తొలగించడానికి సెలైన్ రిన్స్ లేదా నేతి పాట్ ఉపయోగించడం కామన్. ఈ పద్ధతి ముక్కు దిబ్బడను తొలగించడమే కాకుండా చికాకును కూడా తగ్గిస్తుంది, రోజువారీ అలెర్జీ ఉపశమనం కోసం ఇది చాలా మంచిది.



