- Telugu News Photo Gallery Spiritual photos Shani Athi Vakri These zodiac signs to have Raja yoga and Dhana Yoga details in Telugu
Lord Shani: శనికి అతి వక్రం…ఆ రాశుల వారికి రాజ, ధన యోగాలు ఖాయం..!
Shani Athi Vakri: ఈ నెల(సెప్టెంబర్) 10వ తేదీ నుంచి మీన రాశిలోని శనీశ్వరుడు అతి వక్రం చెందడం జరుగుతోంది. ప్రస్తుతం మీన రాశిలో సాధారణ వక్రగతిలో ఉన్న శని తనకు సప్తమ స్థానమైన కన్యారాశిలో రవి ప్రవేశిస్తున్న కారణంగా అతి వక్రం చెందడం జరుగుతుంది. ఈ అతి వక్ర స్థితి సుమారు 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. వారు ఏ రంగంలో ఉన్నా కలలో కూడా ఊహించని విధంగా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది.
Updated on: Sep 03, 2025 | 7:57 PM

వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న శని ప్రబల వక్రం చెందడం వల్ల అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా వివిధ మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శని అతి వక్రం చెందడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి నవమ స్థానంలోకి శని ప్రవేశం వల్ల అష్టమ శని దోషం తొలగిపోయి కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయ వృద్ధితో పాటు ఆశించిన పురోగతి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. నిరుద్యోగు లకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శని ప్రబలంగా వక్రించడం వల్ల కొంత ప్రయత్న పూర్వకంగానూ, కొంత అప్రయత్నంగానూ ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభి స్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శని అతి వక్రం చెందడం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. క్రమంగా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. గృహ యోగం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి మూడవ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అతి వక్రం చెందడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.



