- Telugu News Photo Gallery Spiritual photos Lunar Eclipse 2025 on September 7th, donate these things to remove bad omen
Chandra Grahan 2025: చంద్రగ్రహణం రోజున ఈ వస్తువులను దానం చేయండి.. శని, చంద్ర దోషాలు తొలగిపోతాయి..
ఈ సంవత్సరంలో రెండవ , చివరి చంద్ర గ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్ర గ్రహణం బ్లడ్ మూన్ గా ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబితే.. జ్యోతిష్కులు రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం కుంభ రాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడనుంది. అంతేకాదు ఈ రోజు నుంచే పితృ పక్షం కూడా ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో గ్రహణ దోషం నుంచి ఉపశమనం కోసం కొన్ని వస్తువులను దానం చేయమని పండితులు సూచిస్తున్నారు.
Updated on: Sep 03, 2025 | 11:03 AM

2025 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణానికి కూడా సూతక కాలం ఉంటుంది. భారతదేశంతో పాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా సహా అనేక ఇతర దేశాల్లో కనిపిస్తుంది.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, చంద్రగ్రహణం శుభప్రదంగా పరిగణించబడదు. అందులోనూ ఈ చంద్రగ్రహణం శనీశ్వరుడు అధినేత అయిన కుంభ రాశిలో ఏర్పదనుండడంతో.. గ్రహణ దుష్ప్రభావాన్ని తొలగించడానికి, కొన్ని వస్తువులను దానం చేయాలి. చంద్రగ్రహణం రోజున మోక్ష కాలంలో దానం చేయాలి. కనుక ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.

చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆహారాన్ని దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఇంట్లో ఆహార కొరత ఉండదని చెబుతారు.

చంద్రగ్రహణం రోజున బట్టలు దానం చేయడం కూడా చాలా ఫలవంతమైనదని చెబుతారు. ఈ రోజున చంద్రుడి అనుగ్రహం కోసం తెల్లని బట్టలు దానం చేయడం చాలా మంచిదని అంటారు.

చంద్రుడు పాలు, పెరుగుతో సంబంధం కలిగి ఉన్నాడు. కనుక చంద్రగ్రహణం రోజున వీటిని దానం చేయడం వల్ల కుటుంబంలో మానసిక ప్రశాంతత, సుఖ శాంతులు, ఆనందం నెలకొంటాయని విశ్వాసం

చంద్రగ్రహణం రోజున వెండి లేదా బియ్యం వంటి తెల్లని వస్తువులను దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. చంద్రుని రంగు తెల్లగా ఉంటుంది కనుక ఈ రోజున వీటిని దానం చేయడం వల్ల చంద్రదేవుని ఆశీస్సులు చెక్కుచెదరకుండా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారని నమ్మకం.

చంద్రగ్రహణం రోజున చక్కెర దానం చేయడం లేదా ఏదైనా గుడిలో చక్కర ఇవ్వడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని, కుటుంబానికి ఇబ్బందులు రావని చెబుతారు.